Telangana Students (imagecredit:twitter)
తెలంగాణ

Telangana Students: కామన్ కోర్సుల పై విద్యార్థుల చిన్నచూపు.. కారణం అదేనా!

Telangana Students: రానురాను రెగ్యులర్ డిగ్రీలంటే విద్యార్థులు లైట్ తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ప్రతిఏటా డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. రెగ్యులర్ డిగ్రీలకు బదులు ఇతర కోర్సుల వైపు చూస్తున్నారు. తెలంగాణలో ప్రతీయేటా 5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు రాసి బయటకు వస్తున్నారు. వీరికి అదనంగా సీబీఎస్ఈలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఉంటారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు కామన్ డిగ్రీల వైపు ఆసక్తి చూపడం లేదు. ఎక్కువగా బీటెక్, బీఈ, ఐఐటీ, ఎంబీబీఎస్, బీ ఫార్మసీ, అగ్రికల్చర్, లా కోర్సులపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో రెగ్యులర్ డిగ్రీ కోర్సులపై ఆసక్తి తగ్గినట్లుగా తెలుస్తోంది.

రోజురోజుకూ ఆధునికత పెరిగిపోతోంది. కానీ అందుకు తగినట్లుగా విద్యావ్యవస్థలో మార్పులు మాత్రం రావడం లేదు. కానీ ఇప్పుడిప్పుడే కొత్త సబ్జెక్టులతో పాటు సిలబస్ లోనూ మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు. కాగా ఇటీవలే.. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రతీ ఏటా డిగ్రీ అడ్మిషన్స్ కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ సీట్లను దీని ద్వారానే భర్తీ చేయనుంది. రాష్ట్రంలో దోస్త్ పరిధిలో మొత్తం 1025 డిగ్రీ కాలేజీల్లో 4.50 లక్షల సీట్లు ఉన్నాయి. నాన్ దోస్త్ పరిధిలో మరో 70 కాలేజీలు ఉన్నాయి. గతేడాది దోస్త్ పరిధిలో ఉన్న కాలేజీల్లో 50 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. ఈ ఏడాది కూడా దోస్త్ లో ప్రవేశాలు ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉంది.

Also Read: Hyderabad Crime: బరితెగించిన యువతి.. బాలుడిపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

తెలంగాణలోని పలు కాలేజీల్లో ఉన్న సీట్లకు డిమాండ్ లేక చాలా డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు. బీఏ లాంటి కోర్సులు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కొన్ని సొంత భవనాలు లేకుండానే కొనసాగుతున్నాయి. మరికొన్నింటిలో సౌకర్యాలు లేనేలేవు. ఇంకొన్ని కాలెజీల్లో లెక్చరర్ ఉన్న కోర్సుల్లో విద్యార్థులు లేరు.., విద్యార్థులు ఉన్న కోర్సుల్లో లెక్చరర్లు లేరు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇకపోతే కోఠి ఉమెన్స్ కాలేజీ, నిజాం కాలేజీ లాంటి ప్రభుత్వ కళాశాలలో మాత్రం డిగ్రీ సీట్లకు భారీ డిమాండ్ ఉంది. ఇక్కడ సీటు దొరికితే చాలు అనే విధంగా ఉంది. మిగతా కాలేజీల్లో మాత్రం చేరడానికి విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపకపోవడం గమనార్హం. ఈసారైనా దోస్త్ ద్వారా సాధారణ డిగ్రీలో ప్రవేశాలు పెరుగుతాయా? లేదా? అన్నది చూడాలి.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది