Tunica Leaf (imagecreditAI)
తెలంగాణ

Telangana Tunika: తునికాకు సేకరణపై నీలి నీడలు.. సిగరెట్ మోజే కారణమా!

Telangana Tunika: తునికాకు సేకరణపై నీలినీడలు అలుముకున్నాయి. తునికాకే ఉపాధిగా పొందుతున్న కుటుంబాలకు జీవనోపాధిపై ఎఫెక్ట్ పడుతుంది. రోజురోజుకు సిగరేట్లపై మోజు కారణంగా బీడిలను తాగేవారు తగ్గడమే కారణం అని సమాచారం. దీంతో కాంట్రాక్టర్లు కొనుగోలు ముందుకు రావడం లేదని అధికారులు వెల్లడించిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క 2017లో మాత్రమే తునికాకు సేకరణ లక్ష్యం నూరుశాతం కంప్లీగ్ అయింది.

ప్రభుత్వం ప్రతి ఏటా తునికాకు సేకరణ, అమ్మకంపై టార్గెట్ పెడుతుంది. ఆ లక్ష్యం చేరుకోవడానికి పక్కా ప్రణాళికలు ముందుకు సాగుతుంది. అయితే గత రెండేళ్లుగా టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కాంట్రాక్టర్లు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఆ విషయం అధికారులు పేర్కొన్న లెక్కల్లోనే స్పష్టమవుతోంది. ఇది తునికాకు సేకరిస్తున్న వారి ఉపాధిపై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది. ఇలాగే కొనసాగితే వారికి ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి లేకపోలేదు.

2023 లో రాష్ట్ర వ్యాప్తంగా 230 తునికాకు యూనిట్లు టార్గెట్ విధించింది. కేవలం 110 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మిగతా 120 యూనిట్లలో ఆకుసేకరణ నిలిచింది. అదే విధంగా 2024లో 194 తునికాకు యూనిట్లు టార్గెట్​ విధించగా.. కేవలం 104 మాత్రమే అమ్ముడు పోయాయి. మిగతా 90 యూనిట్లలో ఆకు సేకరణ నిలిచిపోవడంతో ఆయా అటవీ గ్రామాలకు చెందిన వేలాది మంది కూలీలకు వేసవిలో ఉపాధి లేకుండా పోయింది.

ప్రభుత్వ లక్ష్యం: 

రాష్ట్రంలో మొత్తం 194 తునికాకు యూనిట్లలో ఈ ఏడాది 1,22,000 స్టాండర్డ్స్ బ్యాగ్స్ (ఎస్బీ) సేకరించాలని లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఇందులో అటవీ డివిజన్లో 2,500 కల్లాల వరకు వరకు ఏర్పాటు చేయనున్నారు. ఒక్క ఎస్బీలో వెయ్యి తునికాకు కట్టలుంటాయి. 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3.30 చొప్పున గుత్తేదారులు కూలీలకు చెల్లిస్తారు. ఒక మనిషి రోజుకు 300 కట్టలు సేకరిస్తే సగటున రూ.వెయ్యి వరకు గిట్టుబాటు అవుతుంది. నెల రోజుల పాటు తునికాకు సేకరణతో ఇద్దరు సభ్యులున్న కుటుంబానికి రూ.10 వేల నుంచి రూ.15 వరకు ఆదాయం రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో అటవీ డివిజన్లలో అమ్ముడు పొని తునికాకు యూనిట్లలో ప్రభుత్వమే ఆకు సేకరణ చేపట్టాలని పలు అటవీ గ్రామాల కూలీలు కోరుతున్నారు.

Also Read: Village Secretaries: పల్లెలో ఆ సమస్య తీరినట్లే… లేదంటే చర్యలే!

వేసవిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో అటవీ గ్రామాలకు చెందిన వేలాది మంది కూలీలు తునికాకు సేకరణతో ఉపాధి పొందుతారు. రాష్ట్రంతో పాటు ఒరిస్సా ఛత్తీస్గడ్ నుంచి కూలీలు వచ్చి తునికాకు సేకరిస్తారు. యూనిట్ల వారీగానే ఆన్లైన్లోనే టెండర్లు నిర్వహించారు. ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు తునికాకు యూనిట్ల టెండర్లలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10 యూనిట్ల వరకే అమ్ముడు పోయాయి.

మిగతా 20 యూనిట్లలో ఆకుసేకరణ కోసం గుత్తేదారులు ఎవరు ముందుకు రాలేదని సమాచారం. అమ్ముడు పోయిన యూనిట్లలోనే గుత్తేదారులు ఆకును సేకరిస్తారు. అయితే సేకరణకు ముందుగానే నాణ్యతగా తునికాకు ఆకు రావటానికి కొందరు గుత్తేదారులు కొమ్మ కొట్టడం (ప్రూనింగ్) చేయిస్తారు. కానీ ఈ పని కూడా గత కొద్ది సంవత్సరాలుగా చాలా వరకు యూనిట్లలో గుత్తేదారులు చేపట్టడం లేదని సమాచారం.

తునికాకు సేకరణ పై పులుల ఎఫెక్ట్

ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో పుల్లల సంచారం ఎక్కువైంది. భయంతో తునికాకు సేకరణకు కూలీలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో తునికాకు తగ్గిన యూనిట్లు తగ్గినట్టు సమాచారం. అదే విధంగా యువత ఎక్కువగా సిగరేట్ పై మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం బీడిలు తాగేవారు సైతం ఫ్యాషన్ కోసం సిగరేట్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో బీడీలు తాగే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది.

ఆ పరిస్థితులలో కాంట్రాక్టర్లు సైతం తునికాకు యూనిట్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని విశ్వసనీయ సమాచారం. 2017లో తునికాకు సేకరణ లక్ష్యం 100% పూర్తి చేశారు. ఈ సీజన్లో ఒక్కొక్క కుటుంబానికి సుమారు 20 వేల వరకు ఆదాయం వస్తుంది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తునికాకు సేకరణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తునికాకు సేకరణపై ఆధారపడిన గ్రామాల ప్రజలు ప్రత్యామ్నం చూసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Also Read: Sheep Distribution Scam: గొర్రెల స్కామ్ ఏ1 అరెస్ట్.. కింగ్ పిన్ సంగతేంటి?

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?