Case On Anvesh: నా అన్వేషణ అన్వేష్ అనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని నెలల నుంచి ఇతను బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేస్తున్నాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎవర్ని వదలకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ పేర్లు బయటకు చెబుతూ వీడియోలను పెడుతున్నాడు. ఇప్పటికే చాలా మందివి పెట్టగా.. ఇంకా ఉన్నారంటూ 3 రోజులకొక వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నాడు. ఇలా వీటి మీద వచ్చిన డబ్బును ఆన్లైన్ గేమ్స్ లో పోగొట్టుకున్న వాళ్ళకి ఇస్తున్నాడు. అయితే , తాజాగా అన్వేష్ కి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Tollywood Actress: సినీ ఇండస్ట్రీలో వరుసగా 7 ప్లాపులు అందుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
ఇటీవలే హైదరాబాద్ మెట్రో పై కూడా బెట్టింగ్ ఆరోపణలు చేశాడు. రూ. 300 కోట్లు బెట్టింగ్ యాప్స్ పై సంపాదించరంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆధారాలు చూపించి మాట్లాడాలి కానీ తప్పుడు సమాచారం ఎలా చెబుతాడంటూ సైబర్ క్రైం పోలీసులు అన్వేష్ పై సుమోటోగా కేసు నమోదు చేశారు. అన్వేష్ చేసిన ఆరోపణల్లో ఎలాంటిన్ నిజం లేకపోతే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు