Naa Anveshana: గత కొన్ని నెలల నుంచి ఇతను బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేస్తున్నాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎవర్ని వదలకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ పేర్లు బయటకు చెబుతూ వీడియోలను పెడుతున్నాడు. ఇప్పటికే చాలా మందివి పెట్టగా.. ఇంకా ఉన్నారంటూ 3 రోజులకొక వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నాడు. ఇలా వీటి మీద వచ్చిన డబ్బును ఆన్లైన్ గేమ్స్ లో పోగొట్టుకున్న వాళ్ళకి ఇస్తున్నాడు. అయితే , తాజాగా మరో సంచలన వీడియో షేర్ చేసి వార్తల్లో నిలిచాడు.
Also Read: Tollywood Actress: సినీ ఇండస్ట్రీలో వరుసగా 7 ప్లాపులు అందుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
హర్ష సాయి, ఏ జూడ్ ఇద్దరూ దొంగలే అంటూ పెద్ద బాంబ్ పేల్చాడు. అయితే, జనాలు కూడా వామ్మో ఇదే నిజమేనా అంటూ వేల కొద్దీ కామెంట్లు పెడుతున్నారు. హర్ష సాయి ది పక్కన పెడితే , ఏ జూడ్ పేరు తెర పైకి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇతను ఇప్పటి వరకు ఉపయోగపడే కంటెంట్ నే పెట్టాడు. అయితే, దీని వెనుక మోసం ఉందంటూ నమ్మలేని షాకింగ్ నిజాలను నా అన్వేషణ అన్వేష్ చెప్పాడు. వాస్తవానికి ఏ జూడ్ అనే ఈ అజయ్ హనుమంత్ గివ్ అవేస్ ఇస్తూ చాలా ఫేమస్ అయ్యాడు. కానీ, ఇది నిజం కాదంటూ అన్వేష్ పెద్ద బిగ్ బాంబ్ పేల్చాడు. ఇది తీసుకో .. అది తీసుకో.. ఇది విను ఇది విను ఇది విను అంటూ ఇచ్చింది లేదు .. పెట్టింది లేదు గివ్ అవేస్ ఇస్తున్నా అని చెప్పి అందరికీ ఊరిస్తూ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశావ్.. ఇలా చేసినప్పుడు దీన్ని ఖండించాలి కదా అంటూ ఏ జూడ్ పై మండి పడ్డాడు.
Also Read: Allu Arjun: ‘వేవ్స్ 2025’లో చిరుపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఏమంటారో?
ఇంకో ముఖ్యమైన విషయం అడుగుతున్న దీనికి జవాబు చెప్పు ” నువ్వు ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు. వీడియోస్ పెట్టేటప్పుడు ఏది నిజమో ? ఏది అబద్దమో? కూడా తెలుసుకోకుండా పెడుతున్నావ్ .. టాప్ 4 లో ఉన్నప్పుడు జనాలకు ఏది మంచో చెప్పాలి కదా అని అన్నాడు. ఇది తప్పు బ్రో .. నిన్ను యూత్ చాలా నమ్ముతుంది. కాబట్టి, వారికీ ఉపయోగపడేవి చెప్పు, వారిని అడ్డు పెట్టుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకు” అని గట్టిగా చెప్పాడు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.