Village Secretaries (imagecredit:AI)
తెలంగాణ

Village Secretaries: పల్లెలో ఆ సమస్య తీరినట్లే… లేదంటే చర్యలే!

Village Secretaries: గ్రామాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. పారిశుధ్య సమస్యతో సతమతమవుతున్న గ్రామాలకు ప్రభుత్వం చర్యలు ఉపశమనం కలిగిస్తున్నాయి. డైలీశానిటేషన్ రిపోర్టు (డీఎస్ఆర్) తీసుకొచ్చి అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. గ్రామకార్యదర్శులు విధిగా విధుల్లో ఉండాల్సిందే. లేకుంటే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సైతం సిద్దమవుతున్నట్లు సమాచారం. దీంతో అలర్టు అయిన కార్యదర్శులు ఉదయమే విధుల్లో చేరుతున్నారు. చేయని వారిపై నిఘాను ప్రభుత్వం పెంచింది.

గ్రామపంచాయతీలకు గత17 నెలలుగా పాలక వర్గాలు లేకపోవడంతో కొంత మౌలిక సమస్యలు తిష్టవేసినట్లు సమాచారం. ఆ సమస్యల పరిష్కారం కోసం కార్యదర్శులు చొరవ తీసుకుంటున్నప్పటికీ నిధుల లేమీతో కొట్టుమిట్టాడుతున్నాయి. మరోవైపు అధనపు భారంతో సెక్రటరీలు సతమతమవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం గ్రామాల్లోని మౌలిక సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గ్రామాల్లో ప్రతి రోజూ చేపడుతున్న పారిశుధ్య సమస్యలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేసేందుకు ప్రభుత్వం డైలీ శానిటేషన్ రిపోర్టు ను(డీఎస్ఆర్)యాప్ ను తీసుకొచ్చింది.

Also Read: Gadwal Congress Conflict: గద్వాల కాంగ్రెస్ లో రాజుకుంటున్న చిచ్చు.. రోడ్డెక్కుతున్న నేతలు!

ఈ యాప్ లో కార్యదర్శులు మురుగు కాల్వలు, రోడ్లు, అంగన్ వాడీ, స్కూల్లు, ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలు, పల్లె ప్రకృతివనం, నర్సరీ, వాటర్ లీకేజీ, ఎన్ని కుటుంబాలతోనల్లాలతో నీటి సరఫరా, వీధిలైట్ల వివరాలు, ప్రతీది యాప్ లో అప్ లోడ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. అయితే కొంత పనిభారంతో సెక్రటరీలు సతమతమవుతూ కొంత జాప్యం జరుగుతుందనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. దానికి చెక్ పెట్టేందుకు మానిటరింగ్ చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలతో ఉన్నతాధికారులతో పర్యవేక్షణ చేస్తున్నారు. సమస్యలు కొలిక్కి వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

పీఆర్ ఆర్ డీ క‌మిష‌న‌రేట్ నుంచి పర్యవేక్షణ:

గ్రామాల్లోని మౌలిక సమస్యలపై ఉన్న‌తాధి కారుల నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ చేస్తున్నారు. నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకునేలా సిబ్బందితో ప‌నిచేస్తున్నారు. డీఎస్ఆర్ యాప్ లో వివరాలను అప్ లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు స‌కాలంలో విధుల‌కు హాజ‌ర‌వుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ప్ర‌తి రోజు ఉద‌యం 9 గంట‌ల‌లోపే గ్రామ పంచాయ‌తీల‌కు చేరుకుని విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఎవ‌రెవ‌రు ఎప్పుడెప్పుడు జీపీల‌కు చేరుకుంటున్నారు? ఏలాంటి ప‌నులు చేయిస్తున్నారు వంటి వివ‌రాల‌న్ని పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ యాప్ లో న‌మోదు అవుతుండ‌టంతో పీఆర్ ఆర్ డీ క‌మిష‌న‌రేట్ నుంచి ప‌ర్య‌వేక్షించ‌డం సులువుగా మారింది.

దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌చారాన్ని తెలుసుకుంటూ..అనుగుణంగా జిల్లా స్థాయి, వారి కింది స్థాయి అధికారుల‌కు చేర‌వేస్తున్నారు. దీంతో ఉద‌యం 9 గంట‌ల లోపే గ్రామ పంచాయ‌తీల్లో విధుల‌కు 98 శాతం సెక్ర‌ట‌రీలు హాజ‌ర‌వుతున్నారు. పారిశుద్య ప‌నులు, ఇత‌ర ప‌నులు పూర్తి చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటూ ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నారు. ప‌నులు జ‌ర‌గ‌ని గ్రామ పంచాయ‌తీల‌ను గుర్తించి సంబంధిత డీఎల్ పీవో, డీపీవోల‌కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో జీపీల్లో తిష్టవేసిన స‌మ‌స్య‌లు కొలిక్కి వస్తున్నాయి.

Also Read: BRS Membership: గులాబీ గూటిలో కొత్త గుబులు.. ఆ బాధ్యతలు ఎవరికో?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు