BRS Membership (Image Source: Twitter)
సూపర్ ఎక్స్‌క్లూజివ్

BRS Membership: గులాబీ గూటిలో కొత్త గుబులు.. ఆ బాధ్యతలు ఎవరికో?

BRS Membership: బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది పార్టీ కేడర్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాలు ఎప్పుడిస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. మే డే నుంచి సభ్యత్వ నమోదు అవుతుందని ఆశించినప్పటికీ ప్రారంభం కాకపోవడంతో ఇంకా జాప్యం చేస్తారా? ఈ నెలలో నమోదును ప్రారంభిస్తారా? లేదా అనేది సైతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో 60లక్షల సభ్యత్వాలు నమోదు చేసిన బీఆర్ఎస్ ఈ సారి ఎంత చేస్తుందనేది సైతం కేడర్ లో చర్చించుకుంటున్నారు.


బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి సభ తర్వాత పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్ఠిపెడతామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తొలుత సభ్యత్వ నమోదు చేస్తామని, ఆతర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు కమిటీలు వేస్తామని ప్రకటించారు. సభ్వత్వాన్ని గతంకంటే ఎక్కువ చేస్తామని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే రోజులు గడుస్తుంది. కానీ పార్టీ మాత్రం ఇంకా సభ్యత్వ నమోదు తేదీని ప్రకటించలేదు. మేడేను పురస్కరించుకొని పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని కేడర్ భావించింది.

సభ్యత్వ నమోదుతో ప్రజల దగ్గరకు వెళ్లొచ్చని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఫల్యాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పార్టీ మాత్రం నమోదు ఎప్పటి నుంచి చేపడుతుందనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. అధినేత కేసీఆర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం. గతంలో సభ్యత్వ నమోదు కంప్లీట్ అయిన తర్వాత పార్టీ ప్లీనరీగానీ, సభగానీ నిర్వహించేవరకు అయితే ఈసారి అందుకు భిన్నంగా రజతోత్సవ సభ నిర్వహించారు. సక్సెస్ చేశారు. ఇప్పుడు సభ్యత్వ నమోదుపై పార్టీ అధిష్టానం దృష్టించనుంది.


బీఆర్ఎస్ పార్టీ 2021లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టింది. 60 లక్షల సభ్యత్వాలు నమోదు చేశామని, ఒక ప్రాంతీయ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో సభ్యత్వాలు రికార్డు అని కేటీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత చేయలేదు. 2023లో పాత సభ్యత్వ నమోదును రెన్యూవల్ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను కొనసాగించలేదు. అయితే ఈ నెలలో సభ్యత్వ నమోదు చేయాల్సి ఉంది. కమిటీలను సైతం వేయాల్సి ఉండటంతో పాటు అక్టోబర్ లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తికావాల్సి ఉంది. ఇందుకు ప్రణాళిక బద్దంగా పార్టీ ముందుకు వెళ్లాల్సి ఉంది.

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ.2లక్షల బీమాను వర్తింపచేస్తున్నారు. పార్టీ తొలిసారిగా డిజిటల్ పద్దతిలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టబోతుంది. ప్రతి వ్యక్తి వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్ లో పొందుపర్చనున్నారు. గతంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా సభ్యత్వ నమోదు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ సభ్యత్వ నమోదు బాధ్యతలను ఎవరికి అప్పగించబోతున్నారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగిస్తారా? మరెవరికైనా అప్పగిస్తారా? లేకుంటే ఒక కమిటీ వేసి పర్యవేక్షణ చేయిస్తారా? అనేది ఆసక్తి కరంగా మారింది. పార్టీ అధినేత ఏం నిర్ణయం తీసుకుంటారనేది పార్టీ నేతలు సైతం ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ చేతుల మీదుగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు సమాచారం. మరోవైపు కేటీఆర్ కు వెన్నుపూసగాయం కారణంగానే సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కాలేదని, కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈనెలలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిసింది.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను , మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. వారే ఆ నియోజకవర్గంలో సుప్రీం అని ప్రకటించింది. దీంతో ద్వితీయశ్రేణి నాయకులను పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో వర్గాలు ఏర్పడ్డాయి. సహకారం కరువైంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటమికి ప్రధానకారణమైంది. అయితే ఇప్పటికి కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎలా విజయవంతం చేస్తారనేది ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేలుగానీ, పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చెబితే కిందిస్థాయి నేతలు సభ్యత్వం చేస్తారా? అనే చర్చజరుగుతుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దూరంపెట్టడంతో ఇప్పుడు సభ్యత్వం అంటే ఎలా చేస్తారని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇన్ చార్జులు చెబితే నేతలు వినే పరిస్థితి కూడా లేదు. పార్టీ జోక్యం చేసుకొని సందేశం ఇస్తే తప్ప సభ్యత్వం సక్సెస్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

2017లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పార్టీ ప్లీనరీలో రాష్ట్ర కమిటీ ని ప్రకటించింది. ఆ కార్యవర్గమే ఇప్పటికీ కొనసాగుతుంది. నూతన కార్యవర్గం ప్రకటించలేదు. కొంతమంది ఈ కార్యవర్గంలో ఉన్న సభ్యులు పార్టీలు మారారు. దీంతో పార్టీలో కొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి. అయినప్పటికీ అధిష్టానం భర్తీ చేయలేదు. 2021లో పార్టీ సంస్థాగత కమిటీలను వేసింది. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీవరకు 15 మంది సభ్యులతో కూడిన గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.

గ్రామాల్లోని విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక తదితర పార్టీకి అనుబంధాలైన 14 సంఘాలను నియమించింది. అదే నెల 13 నుంచి 20వ తేదీవరకు మండల స్థాయిలో కమిటీలను వేసింది. 2022 జనవరి 26న పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యవర్గాలను, అనుబంధ కమిటీలను నియమించలేదు. 2023లో డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్లీనరీ సైతం నిర్వహించలేదు. కమిటీలపై దృష్టిసారించలేదు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!