Sheep Distribution Scam (imagecredit: twitter)
తెలంగాణ

Sheep Distribution Scam: గొర్రెల స్కాం పై సీతక్క ధ్వజం… స్కాం లపై కఠిన చర్యలే!

Sheep Distribution Scam: తెలంగాణ తొలి ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన గొర్రెల స్కాంపై సీతక్క ధ్వజమెత్తారు. శనివారంమహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని భక్తులపల్లి లో పర్యటించిన సీతక్క మీడియాతో మాట్లాడారు. గొర్రెల స్కాం, కెసిఆర్ పాలనలో జరిగిన స్కాములపై సీతక్క కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కెసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ వ్యాప్తంగా అవినీతి రాజ మేలిందన్నారు.

Also Read: CM Revanth Reddy: నన్ను నమ్మండి.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు.. సీఎం రేవంత్

అవినీతి దోపిడీ చేసిన వారిపై ఉక్కు పాదం మోపాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. . టిఆర్ఎస్ పాలనలో స్కీముల పేరుతో భారీ స్కాములు జరిగాయని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పథకం కింద పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని మొక్కుపిండి తిరిగి ఆ డబ్బులు రికవరీ చేస్తామంటూ సీతక్క ఘాటుగా స్పందించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా వినూత్నంగా అమలు చేయబోతుందని ఆమె స్పష్టం చేశారు. స్కాముల్లో ఉన్న ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న ప్రతి ఒక్కరిని చట్టం ఎదుటకి తీసుకొస్తామంటూ హెచ్చరించారు.

Also Read: BRS Membership: గులాబీ గూటిలో కొత్త గుబులు.. ఆ బాధ్యతలు ఎవరికో?

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!