Sumanth Second Marriage
ఎంటర్‌టైన్మెంట్

Sumanth: అఖిల్ కంటే ముందే అక్కినేని ఇంట్లో ఈ హీరో పెళ్లి.. నిజమేనా?

Sumanth: ది లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)కి ఆ ఇంట్లో అత్యంత ఇష్టమైన వారు ఎవరయ్యా? అంటే వెంటనే అందరూ హీరో సుమంత్ పేరు చెబుతారు. ఏఎన్నార్ (ANR) చనిపోయే వరకు పక్కనుండి సపర్యలన్నీ చేసింది సుమంతే అని ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లో కొందరు చెబుతూ ఉంటారు. అందుకే ఏఎన్నార్‌కు సుమంత్ అంటే ఎంతో ఇష్టమట. సుమంత్ సినిమాలో కూడా నాగేశ్వరరావు యాక్ట్ చేశారు. వారిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటుంది. ఏఎన్నార్ చనిపోయినప్పుడు సుమంత్‌ని ఓదార్చడం ఎవరివల్లా కాలేదని ఆ ఫ్యామిలీలోని మెంబర్స్ ఇప్పటికీ ఏదో ఒక చోట మాట్లాడుతూనే ఉంటారు. మరి అంత ఇష్టమైన మనవడి పెళ్లి విషయంలో ఏఎన్నార్ చాలా అసంతృప్తిగా ఫీలయ్యేవారట. కారణం సుమంత్ పెళ్లి చేసుకున్న హీరోయిన్ కీర్తి రెడ్డి నుంచి విడిపోవడమే.

Also Read- Dilip Devgan and Janulyri: పెళ్లి చేసుకోబోతున్నాం.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేశారు

సుమంత్, కీర్తి రెడ్డి (Keerthi Reddy) విడాకుల తర్వాత మరో పెళ్లి చేయాలని ఏఎన్నార్ ఎంతగానో ప్రయత్నించారనే టాక్ కూడా ఉంది. అయినా కూడా, సుమంత్ వద్దని ఏవేవో కారణాలు చెబుతూ వచ్చాడట. ఇక ఆ మధ్య తన మొదటి భార్యతో విడిపోవడానికి కారణం చెబుతూ.. ‘‘మా ఇద్దరికీ పెళ్లి సమయానికి సరైన మెచ్యూరీటీ లేకపోవడం వల్లే విడిపోయాం. ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. ఇప్పటికీ తను నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. నేను కూడా ఫోన్ చేసి మాట్లాడతాను. మా మధ్య ఎటువంటి తగాదాలు జరగలేదు. మా ఇద్దరి లైఫ్ ఒక సినిమా స్టోరీలా ఉంటుంది’’ అని సుమంత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు, భవిష్యత్‌లో మళ్లీ పెళ్లి చేసుకుంటానేమో.. ఇప్పుడప్పుడే చెప్పలేను.. అంటూ రెండో పెళ్లి గురించి కొన్నాళ్ల క్రితం మాట్లాడారు. ఇప్పుడా సమయం వచ్చేసినట్లుగా తెలుస్తుంది.

అక్కినేని ఫ్యామిలీలో ఇటీవలే నాగ చైతన్య (Naga Chaitanya) పెళ్లి హీరోయిన్ శోభిత దూళిపాల (Sobhita Dhulipala)తో జరిగింది. మరో అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) పెళ్లికి రెడీ అవుతున్నాడు. అఖిల్ పెళ్లి కంటే ముందే, అక్కినేని ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయనేలా టాక్ మొదలైంది. హీరో సుమంత్ రెండో పెళ్లికి సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలోనే పెళ్లి ప్రకటన వచ్చే అవకాశమున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ పెళ్లి కుమార్తె ఎవరిని అనుకుంటున్నారా? ఇంతకు ముందు కూడా సుమంత్ రెండో పెళ్లికి సంబంధించి వార్తలు వచ్చాయి. తీరా చూస్తే, అది సినిమా కోసం అని మేకర్స్ తర్వాత సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పుడలా కాదులే కానీ, నిజంగానే ఓ హీరోయిన్‌ను ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నట్లుగా టాక్ వినబడుతుంది.

Also Read- Bunny Vas: అల్లు అర్జున్ టీ షర్ట్‌పై జర్నలిస్ట్ కామెంట్.. బన్నీ వాసు కౌంటర్!

ఆ హీరోయిన్ తెలుగులో ఇప్పటికే ఓ ప్రేమకథ చేసిందని, ప్రస్తుతం బాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాలు చేస్తుందనేలా అయితే అంటున్నారు కానీ, ఆ హీరోయిన్ పేరు మాత్రం రివీల్ చేయడం లేదు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రియాక్ట్ అయితే కానీ తెలియదు. ప్రస్తుతానికైతే అఖిల్ కంటే ముందు సుమంత్ ‘పెళ్లికొడుకు’ అవుతాడనే వార్త మాత్రం టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..