Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండపై శుక్రవారం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 26న జరిగిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (Retro Pre Release Event)లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటల్లోని ఒక పదం కాంట్రవర్సీగా మారింది. ‘అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు.. వీళ్లు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్‌సెన్స్ లేకుండా చేసే పనులివి’ అంటూ పహల్గాం ఉగ్రదాడిని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ప్రవర్తనను విజయ్ దేవరకొండ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇందులో వాడిన ట్రైబల్స్ అనే పదం ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. గిరిజన జాతిని అవమానిస్తూ, ఉపన్యాసంలో మాట్లాడిన విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చర్యలు తీసుకోవాలని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ తరపున కిషన్ రాజ్ చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read- Anchor Anasuya: తేజస్విని చూసి ఏడ్చేసిన అనసూయ.. అసలు ఏం జరిగిందంటే?
ఈ ఫిర్యాదుతో విజయ్ దేవరకొండ దిగిరాక తప్పలేదు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కనుక నమోదైతే విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడినట్టే. అందుకే వెంటనే ఈ కేసుపై ఆయన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. తన మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలి అంటూ ఓ సందేశం పోస్ట్ చేశారు. ఇప్పుడీ సందేశం వైరల్ అవుతోంది. దీనిని చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. మా హీరో సారీ చెప్పాడు కదా.. కేసును వెనక్కి తీసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే.. విజయ్ కావాలని ఆ పదాన్ని అనలేదు. ఏదో ఉదహరిస్తూ ఫ్లో లో అలా అనేశాడు. ఆ విషయం ఆయన ఈ వేడుకలో మాట్లాడిన వీడియో చూసిన ఎవరైనా చెప్పేయవచ్చు. కానీ, అక్కడ అన్న పదంతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి.. వెంటనే తన తప్పు తెలుసుకుని విజయ్ సారీ చెప్పాడు. ఇంతకీ విజయ్ పోస్ట్ చేసిన మెసేజ్‌లో ఏముందంటే..
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025
“రెట్రో ప్రీ రిలీజ్ వేడుకలో నేను మాట్లాడిన మాటలతో కొంతమంది సభ్యులు ఆందోళనకు గురైనట్లుగా నా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై స్పష్టంగా వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమంలో కేవలం ఐక్యత గురించి మాత్రమే మాట్లాడాను తప్పితే.. ఏ కమ్యూనిటీనీ, ముఖ్యంగా ఏ షెడ్యూల్డ్ తెగలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడలేదు. భారతదేశంలో ఉన్న మనందరం ఒకటి. అందరం కలిసి ఐకమత్యంగా ముందుకు సాగాలి. అలా ఐక్యంగా నిలబడాలని కోరుకునే నేను భారతీయులకు చెందిన ఒక తెగ పట్ల ఉద్దేశపూర్వకంగా ఎలా వివక్షత చూపుతాను? వారందరినీ నా కుటుంబంలోని సోదరుల్లానే చూస్తాను. నేను ఉపయోగించిన ట్రైబల్ అనే పదం చారిత్రక లేదంటే నిఘంటువు అర్థంలో ఉద్దేశించబడింది. నాగరికత మొదలు కాకముందు మానవ సమాజం ఇలా తెగలు, వంశాలుగా వ్యవస్థీకృతమై తరచుగా సంఘర్షణలతో నిండి ఉండేదనేది నా మాటల్లోని అర్థం. ఒక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి అయితే కానే కాదు. ఇది షెడ్యూల్డ్ తెగల యొక్క ఆధునిక వర్గీకరణకు సంబంధించినది కాదు.. ఇది వలస మరియు వలసానంతర భావన మాత్రమే. 20వ శతాబ్దం మధ్యలోనే ఈ పదం పుట్టుకొచ్చింది. నా మాటలు ఎవరినైనా బాధించినా, ఎవరినైనా తప్పుగా మాట్లాడినట్లు అనిపించినా.. వారందరికీ హృదయపూర్వక విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. శాంతి, పురోభివృద్ధి, ఐక్యత కోసం నా సినిమా మీడియంను ఉపయోగిస్తాను..” అని విజయ్ దేవరకొండ ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read- Affair Video Song: మగవాళ్లకి ఎంట్రీలేని కంట్రీలోకే వస్తానంటే.. ‘ఎఫైర్’ వీడియో సాంగ్ వైరల్
ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడితే, ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అనేలా సెలబ్రిటీలు సైతం జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా స్పీచ్ అంతా ఎక్కడా సైడ్ ట్రాక్‌కి వెళ్లకుండా, పాక్‌కి గట్టిగానే ఇచ్చాడు. కానీ ఆయన వాడిన ఈ ఒక్క పదం మాత్రం ఆయనతో సారీ చెప్పించేంత వరకు తీసుకెళ్లింది. అందుకే అనేది ఆచితూచి అడుగేయాలని. ఇలాంటి సెన్సిటివ్ విషయాలలో ఇంకాస్త జాగ్రత్త అవసరం కొండా.. అర్థమైందా?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు