Modi Praises Chandrababu: అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడారు. తొలుత తెలుగు మాటలతో మోదీ ప్రసంగాన్ని మెుదలుపెట్టగా.. సభ మెుత్తం హోరెత్తింది. ‘తల్లి దుర్గా భవాని కొలువున్న పుణ్యభూమిపై ఉన్న మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. అమరావతి ఒక నరగరం కాదన్న ప్రధాని.. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి అని ప్రశంసించారు. అధునాత ఆంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి అంటూ ఆకాశానికెత్తారు.
అమరావతి ప్రతీ ఆంధ్రా యువకుడి కలలు నిజమయ్యే నగరంగా తయారు కాబోతోందని ప్రధాని మోదీ అన్నారు. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా మారబోతోందని తెలిపారు. ఈ రంగాలకు అవసరమైన మౌళిక వసతులు రికార్డు స్పీడ్ తో పూర్తి చేయడానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని ప్రధాని అన్నారు.
Also Read: CM Chandrababu: బాధలో ప్రధాని.. మాటలతో ఓదార్చిన చంద్రబాబు.. ఏమైందంటే?
అయితే సందర్భంగా చంద్రబాబు గురించి మాట్లాడిన మోదీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ తనతో మెుదలైందని చంద్రబాబు ప్రశంసిస్తున్నారని కానీ మీ అందరికీ తానొక రహస్యం చెప్పదలుచుకున్నానని పేర్కొన్నారు. తాను గుజరాత్ సీఎంగా పనిచేస్తున్న తొలినాళ్లలో.. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నారని చెప్పారు. అప్పుడు ఆయన హైదరాబాద్ ను ఐటీలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో క్లోజ్ పరిశీలించానని తెలిపారు. అధికారులను పెట్టి మరీ ఏం చేస్తున్నారా? అని పరిశీలన చేసినట్లు పేర్కొన్నారు. ఆ రోజు చాలా దగ్గరగా తాను తెలుసుకున్న విషయాలు.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి తాను చేయగలుగుతున్నట్లు చెప్పారు.