CM Revanth Reddy (Image Source: Twitter)
తెలంగాణ

CM Revanth Reddy: నన్ను నమ్మండి.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు.. సీఎం రేవంత్

CM Revanth Reddy: ఇవాళ మే డే పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతీ (Ravindra Bharathi)లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రమ శక్తి, ఉత్తమ యాజమాన్య అవార్డుల ప్రధానోత్సవ ఈవెంట్ తలపెట్టారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. నిరుద్యోగ సమస్యను తగ్గించి దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు.

ఆ ఘనత మాదే
తెలంగాణ సాధనలో.. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకువెళ్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందంటే అందులో కార్మికుల సహకారం ఎంతో ఉందని సీఎం అన్నారు. సింగరేణి లాభాలలో కార్మికులకు వాటాతో పాటు బోనస్ ఇచ్చిన ఘనత తమ ప్రజా ప్రభుత్వానిదేనని చెప్పారు. గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలే పరిస్థితికి వచ్చిందన్న రేవంత్.. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

త్వరలో గిగ్ పాలసీ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. కార్మికులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ విధానమని మరోమారు స్పష్టం చేశారు. అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నట్లు చెప్పారు. అది దేశానికే రోల్ మోడల్ గా నిలవబోతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపిందన్న రేవంత్.. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకుందని ఆరోపించారు.

ఆ బాధ్యత మీదే
ఆర్టీసీలో త్వరలో సమ్మె సైరన్ మోగనున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సమ్మె ఆలోచన వీడాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందన్న రేవంత్.. అది కార్మికుల సంస్థ అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉందని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత మంత్రితో చర్చించాలని కోరారు. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతామన్న రేవంత్.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచించాలని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదన్న సీఎం.. అందుకే కార్మికులు ఒకసారి చూసి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Caste Census Survey: కులగణనలో దేశానికే ఆదర్శం.. రాహుల్ పోరాటం ఫలించింది.. రేవంత్ రెడ్డి

సీఎం హితవు
సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులని స్పష్టం చేశారు. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దని సీఎం హితవు పలికారు. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దని సూచించారు. మరోవైపు కేసిఆర్ చేసిన గాయలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి మీరు పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న సీఎం ఆక్షేపించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు