Single Controversy: అనుకున్నదే అయ్యింది. సింగిల్ టీమ్ దిగొచ్చింది. అంతే కాదు, ‘కన్నప్ప’ టీమ్‌కు సారీ కూడా చెప్పింది. శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పిస్తున్న చిత్రం ‘సింగిల్’. మే 9న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీ విష్ణు కొన్ని ఇతర సినిమాలలోని డైలాగ్స్‌తో పాటు, అల్లు అరవింద్ ‘తండేల్’ ఈవెంట్స్‌లో వేసిన స్టెప్స్ వాడారు. ఇలా ఏదో రకంగా సినిమాను పబ్లిక్‌లోకి తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ముఖ్యంగా ఇందులో ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలోని ‘శివయ్యా’ డైలాగ్‌ని వాడినందుకు మంచు ఫ్యామిలీ (Manchu Family) హర్ట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే ‘మంచుకురిపోతుందని.. పావురాలు కుర్రు కుర్రు అంటాయి’ అని చెప్పే డైలాగ్ కూడా మంచు ఫ్యామిలీ హర్టవడానికి కారణంగా తెలుస్తుంది. అయితే, ఈ వివాదాన్ని పెద్దది చేసుకోవడం ఇష్టంలేక, వెంటనే సింగిల్ టీమ్ సారీ చెప్పడమే కాకుండా.. ఆ డైలాగ్స్ తొలగిస్తున్నట్లుగా చెప్పేందుకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో.. (Single Dialogue)
Also Read- Manchu Family: శివయ్యా.. ఎంత పని చేశావయ్యా! ‘సింగిల్’ ట్రైలర్‌తో మంచు ఫ్యామిలీ హర్ట్!
‘‘అందరికీ నమస్కారం. 28న ‘సింగిల్’ మూవీ ట్రైలర్ లాంఛ్ చేశాం. చాలా మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో ‘కన్నప్ప’ టీమ్ మేము ఈ ట్రైలర్‌లో వాడిన కొన్ని డైలాగ్స్‌కి హర్ట్ అయ్యారని తెలిసింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఈ వీడియో చేస్తున్నాము. అది కావాలని చేసింది కాదు, కానీ తప్పుగా వెళ్లిపోయింది కాబట్టి.. వెంటనే మేము యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేశాం. అవి సినిమాలో కూడా ఉండవు. ఎవరినీ హర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో అయితే చేసింది కాదు. అలాగే ప్రస్తుత జనరేషన్ ఎక్కువగా ఫాలో అయ్యే మీమ్స్‌ను గానీ, సినిమా రెఫరెన్స్‌లను గానీ, బయట ఏవి ఎక్కువగా జరుగుతున్నాయో.. వాటిని సినిమాలో యూజ్ చేశాం. (Single Team Apology)
#single sorry pic.twitter.com/0qid5xWcWQ
— devipriya (@sairaaj44) April 30, 2025
ఆ ప్రాసెస్‌లోనే చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, అల్లు అరవింద్ డ్యాన్స్.. ఇలా అందరి డైలాగ్స్, డ్యాన్స్ ఒక హెల్దీ థీమ్‌తో పాజిటివ్‌గా చేశాము. అలాంటివి ఏమైనా ఇబ్బంది కలిగించి ఉంటే.. మా సింగిల్ టీమ్ తరపున క్షమాపణలు కోరుతున్నాము. అలాంటివేవీ ఇకపై మా టీమ్ నుంచి రాకుండా చూసుకుంటాం. ఇండస్ట్రీలో మేమంతా కూడా ఒక ఫ్యామిలీ. మేము ఫ్యామిలీ కిందే ఉంటాం కాబట్టి.. పొరబాటున ఏదైనా తప్పుగా అర్థమైతే మాత్రం అందుకు సారీ చెబుతున్నాం. మేమంతా ఒకటే. ఒకరిని ఒకరం దూషించుకునే, తక్కువ చేసే ఉద్దేశ్యం అయితే ఇందులో లేదు. మరొక్కసారి ఈవిషయంలో హర్ట్ అయిన వారందరికీ వెరీ వెరీ సారీ. ఈ విషయం చెప్పాలనే ఈ వీడియో చేశాం’’ అని శ్రీ విష్ణు ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
Also Read- Naa Anveshana: ఆ రియాలిటీ షోకు నా అన్వేషణ అన్వేష్.. పెద్ద ప్లానింగే ఇది!
మరో వైపు ‘సింగిల్’ చిత్ర నిర్మాతలలో ఒకరైన బన్నీ వాసు చేసిన ట్వీట్ కూడా దుమారాన్ని రేపుతుంది. శ్రీ విష్ణు వీడియోతో వివరణ ఇస్తూ సారీ చెబితే.. బన్నీ వాసు మాత్రం ‘‘ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది.. అలాగే ఎందుకిప్పుడు గొడవలు అని కూడా ఉంది.. శాంతి.. శాంతి.. శాంతి..!’’ అని ట్వీట్ చేశారు. అంటే బన్నీ వాసు ఏదో గట్టిగా ఇవ్వాలని అనుకుంటున్నాడు కానీ, ఈ టైమ్‌లో అది సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని ఆగుతున్నాడనేది అర్థమవుతుంది. దీనికి నెటిజన్లు.. ‘శివయ్య’ వర్డ్ కి మంచు విష్ణు ఏమైనా పేటెంట్ హక్కులు తీసుకున్నాడా? ఎందుకు భయపడుతున్నారు. ఆ వర్డ్ ఎవ్వరైనా వాడుకోవచ్చు. అది తీసేయవద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైతేనేం.. ‘సింగిల్’కి కావాల్సినంత పబ్లిసిటీ అయితే ఈ రూపంలో జరిగిపోతుంది. ఇదంతా చూస్తున్న వారు ‘పెద్ద స్కెచ్చే ఇది’ అని అనుకుంటుండటం విశేషం.
ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది.. అలాగే ఎందుకిప్పుడు గొడవలు అని కూడా ఉంది.. శాంతి.. శాంతి.. శాంతి..!
— Bunny Vas (@TheBunnyVas) April 30, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు