Naa Anveshana: ఆ రియాలిటీ షోకు నా అన్వేషణ అన్వేష్.. పెద్ద ప్లానింగే ఇది!
Naa Anveshana ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Naa Anveshana: ఆ రియాలిటీ షోకు నా అన్వేషణ అన్వేష్.. పెద్ద ప్లానింగే ఇది!

Naa Anveshana: నా అన్వేషణ అన్వేష్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను ప్రస్తుతం, బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం చేస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసే వాళ్ళ గురించి వీడియోస్ పెడుతూ పాపులారిటీని సంపాదించుకున్నాడు. చిన్న సెలబ్రిటీల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవర్ని వదలకుండా అందరివి వీడియోస్ పెడుతున్నాడు. అలా యూట్యూబర్ లోకల్ బాయ్ నాని నుంచి మొదలు పెట్టి స్టార్ కమెడియన్ అలీ వరకు వరుసగా వీడియోలు విడుదల చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఇతని యూట్యూబ్ ఛానెల్స్ కు కూడా మొత్తం 2.41 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

ఎప్పుడు ఎవరి వీడియో పెడతాడా అని కొందరైతే భయపడుతున్నారు. ఇంకొందరు పెడితే పెట్టుకొనిలే అంటూ వదిలేస్తున్నారు. సామాన్యులకు ఇతను చేసేది నచ్చుతుంది కానీ, సెలెబ్రిటీల్లో కొందరు మాత్రం దీనిని తప్పు బడుతున్నారు. రివర్స్ లో వాళ్ళు కూడా ఫైర్ అయ్యి వీడియోస్ పెడుతూ క్లారిటీ ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పటికే రూ. 50 లక్షల పైన డబ్బులు సంపాదించాడు. ఈ డబ్బునంతా బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పోగొట్టుకున్నవారికి ఇస్తానని ఓ వీడియోలో చెప్పాడు. నేను గత కొన్ని నెలల నుంచి ఈ బెట్టింగ్ యాప్‌లపై వీడియోలు చేసి పెడుతున్నాను. ఇవి నా కోసం కాదు, పేరు కోసం అంతకంటే కాదు. వీటి ద్వారా మొత్తం రూ.30 లక్షల డబ్బు వచ్చింది. ఇంకో రూ. 30 లక్షలు వచ్చే వరకు ఇవి ఆపకుండా చేస్తా. అలా వచ్చిన మొత్తాన్ని రూ. 60 లక్షలు చేసి ఆన్లైన్ లో గేమ్స్ ఆడి ఎవరైతే నష్టపోయారో.. వారికి ఆర్థికంగా సాయం చేస్తాను’ అని చెప్పాడు.

అయితే, తాజాగా అన్వేష్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇంత క్రేజ్ తెచ్చుకున్న అన్వేష్ బిగ్ బాస్ అవకాశం వస్తే  వెళ్తాడా.. లేదా అని చాలా మందికి సందేహం ఉంది. డబ్బు పరంగా అయితే అతను వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే, సొసైటికి మెసేజ్ ఇచ్చేలా ఉద్దేశం ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..