Seed Companies Organizers are Threatening Farmers
తెలంగాణ

Farmers: ఆర్గనైజర్ల బరితెగింపు.. రైతుల పరిహారం దోచుకునే యత్నం?

Farmers: ఏజెన్సీలో మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్లు తమ మోసాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎలాంటి అవకాశం దొరికినా రైతులను (Farmers) ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది రైతులు పరిహారం అందక మృత్యువాత చెందారు. వీటన్నింటిపై స్వేచ్ఛ (Swetcha) అనేక కథనాలు ఇచ్చింది. ఆ కథనాలతో ప్రభుత్వం స్పందించింది. వ్యవసాయ కమిషన్‌ను పంపించి ఆరా తీసింది. అధికారుల నుంచి వివరాలు సేకరించింది. దీంతో విత్తన కంపెనీల్లో భయం మొదలై, చివరకు రైతులకు పరిహారం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. కానీ, అందులో కూడా కొంత దోచుకునేందుకు ఆర్గనైజర్లు ప్రయత్నిస్తున్నారు.

అధికారులపై ఒత్తిడి

మల్టీ నేషనల్ కంపెనీల ద్వారా రైతులకు వచ్చే పరిహారం తమ అకౌంట్‌లోకి రావాలని ఆర్గనైజర్లు వ్యవసాయ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొత్తగా రైతు అంగీకార ధ్రువీకరణ పత్రాన్ని సైతం ప్రింట్ తీసి దానిపై వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో ఆర్గనైజర్లు బలవంతపు సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు అధికారుల చర్యలను ఆర్గనైజర్ల బలవంతపు సంతకాలు పెట్టించుకునేందుకు చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం రైతు వేదిక వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కార్యాలయానికి చేరుకున్నారు.

అధికారులకు.. అప్పులకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్న రైతులు

మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన ఆర్గనైజర్లు పెట్టిన పెట్టుబడులకు రైతులకు సంబంధం లేదు. కానీ, ఈ విషయంలో వ్యవసాయ అధికారులు జోక్యం చేసుకోవడం ఏంటని రైతులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. పంట ప్రారంభంలో చేసుకునే అగ్రిమెంట్ పత్రాన్ని మళ్లీ తీసుకొచ్చి కొత్తగా వ్యవసాయ అధికారుల సమక్షంలో బలవంతపు సంతకాలు తీసుకోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు తమకు లాభం చేకూర్చాల్సింది పోయి ఆర్గనైజర్ల పక్షాన నిలిచి బలవంతపు సంతకాలు పెట్టించేందుకు చూడడం ఏంటని నిలదీస్తున్నారు. వ్యవసాయ అధికారులకు, ఆర్గనైజర్లకు మధ్య ఆఫర్ల బంధం ఉన్నట్లుగా స్పష్టమవుతున్నదని ఆరోపిస్తున్నారు.

రైతులకు కలెక్టర్ హామీ.. కానీ!

రైతులు ఆందోళన చేపట్టడంతో కలెక్టర్ వారితో మాట్లాడారు. ‘‘క్షేత్రస్థాయిలో సందర్శించి నష్టానికి గల కారణాలను తెలుసుకొని జాబితా తయారు చేశాం. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల స్టేట్మెంట్ రికార్డ్ చేసి అందుకు సంబంధించిన జాబితా సిద్ధం చేశాం. ఆ జాబితా ప్రకారమే మల్టీ నేషనల్ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి ఆర్గనైజర్ల సమక్షంలో ఒక్కో ఎకరానికి రూ.90 వేల చొప్పున పరిహారం అందించే విధంగా కృషి చేశాం. అందులో ఆర్గనైజర్లు రైతులకు పెట్టిన పెట్టుబడి రూ.20వేల మినహాయించి రూ.70 వేల రూపాయలు రైతులకు అందే విధంగా కృషి చేస్తున్నాం. ఆర్గనైజర్లు రైతులను మోసగించేందుకు ప్రయత్నిస్తే చర్యలకు వెనుకాడమని కలెక్టర్ వెల్లడించినట్లు రైతులు తెలిపారు. అయితే, మొత్తం రూ.90 వేలు తమకే ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Read Also: CM Revanth Reddy: దేనికైనా రెడీ.. కేసీఆర్ కు సీఎం రేవంత్ మాస్ ఛాలెంజ్!

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?