తెలంగాణ: Anganwadi Holidays: రాష్ట్రంలో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అంగన్వాడీ చిన్నారులకు నెల రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తల్లితండ్రులు , అంగన్వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో నాడు అంగన్వాడీ యూనియన్లతో డైరెక్టర్ కాంతి వెస్లీ అధికారులతో సమావేశం ఎర్పటు చేశారు. పప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో మే 1 నుంచి సెలవులు ఇవ్వనన్నట్లు ఆయన పేర్కోన్నారు.
అంగన్వాడీ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరుకుల సరఫరా చేయనున్నారు.సెలవు కాలంలో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆధికారులు తెలిపారు. ఇంటింటి సర్వే, హోం విసిట్స్, అంగన్వాడీ లో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధులను విధిగా నిర్వర్తించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Hydra Demolish: హైడ్రా ఎఫెక్ట్.. అక్కడ ఇక ప్రయాణం సులువే!
ప్రభుత్వ నిర్ణయంతో వేసవి నుంచి లబ్దిదారులకు కాస్త సిబ్బందికి ఉపశమనం లభించింది. అంగన్వాడీ చరిత్రలోనే తొలి సారిగా సెలవులు, ఇవ్వడంతో త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది. అంగన్వాడీ లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వానికి, చొరవ చూపిన మంత్రి సీతక్కకు అంగన్ వాడీ యూనిట్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.