Nimmala Rama Naidu: 2025 జూన్ కి హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేయడంతో పాటు, 2026 జూన్ కి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా, చంద్రబాబు లక్ష్యం ను మనం అందుకోవాలి అని అన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అమరావతి సచివాలయంలో పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఎజెన్సీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రితో పాటు ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఇటీవలే హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులను ప్రత్యక్షంగా పరిశీలించనప్పుడు పనులు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా జరుగడంలేదని అన్నారు. సీజన్ మొదలయ్యే నాటికి హంద్రీనీవా ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తవ్వాలని అధికారులు, ఏజెన్సీలకు దిశా నిర్దేశం చేశారు. త్వరలోనే హంద్రీనీవా ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్దాయిలో పర్యటించి, పనులపై సమీక్ష చేస్తారని అందుకు తగ్గట్టుగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Deputy CM on Terror Attack: రోహింగ్యాలపై.. పవన్ సంచలన కామెంట్స్
పోలవరం ఎడమ కాలువ పనులైతే నత్తనడకన సాగుతున్నాయని, అనుకున్న సమయానికి పనులు పూర్తిచేసేలా, మెషినరీ, డంపర్లు, ఎక్సకవేటర్లు, బ్యాచింగ్ ప్లాంట్లు, రోలర్లు ఏర్పాటు చేసుకోవాలని ఏజెన్సీలను ఆదేశించారు. ఇచ్చిన గడువు లోగా పనులు పూర్తికాకపోతే ఏజెన్సీలు, సంబందిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పోలవరం ప్రాజెక్టును మే నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు, ప్యానల్ ఆఫ్ ఎక్స్ఫర్ట్స్ కమిటీ సందర్శించనుందని, ఈలోగా ఈసిఆర్ఎఫ్ డ్యాంకు సంబంధించిన డిజైన్స్ తీసుకోవాలని పోలవరం సీఈకు సూచించారు మంత్రి నిమ్మల. ముందుగా గ్యాప్-1 లో ఈసిఆర్ఎఫ్ ఢ్యాం నిర్మాణ పనులు పూర్తిచేసేలా డిజైన్స్ తీసుకోవాలని, వెంటనే గ్యాప్-2 పనులు కూడా మొదలుపెట్టేలా నిపుణుల కమిటీ నుండి అనుమతులు పొందాలని సూచించారు.
ప్రస్తుతం గ్యాప్2లో ఢయాప్రంవాల్ నిర్మాణ పనులు చురుకుగానే జరుగుతున్నాయని, ఇప్పటికి రెండు కట్టర్లు, రెండు గ్రాబర్ల సాయంతో 217 మీటర్లు నిర్మాణం పూర్తైందని, మే మొదటి వారంలో మూడో కట్టర్ తో పనులు మొదలుపెడతామని ప్రాజెక్టు అధికారులు మంత్రి కి తెలిపారు. అదేవిధంగా వర్షాకాలం మొదలయ్యే లోపు ఎగువ కాఫర్ డ్యాంను బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం పనులను మే చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులకు, ఏజెన్సీ ప్రతినిధులుకు సూచించారు.
Also Read: Bharat Sumit: రాహుల్ గాంధీ కామెంట్స్ తో యువ లీడర్స్ లో పదవుల ఆశ?
ఇంక వెలిగొండ ప్రాజెక్ట్ లో టన్నెల్-2 లో బెంచింగ్, లైనింగ్ పనులు ఏప్రియల్ నెలలో నిర్దేశించిన లక్ష్యానికి చేరుకోకపోవడం పై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్, లైనింగ్, రిటైనింగ్ వాల్ కు వెను వెంటనే 10 రోజులలో టెండర్లు పిలిచి, పనులను ఏజెన్సీలు వెంటనే మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వచ్చే సమీక్ష నాటికి ఆయా ప్రాజెక్టుల పనుల్లో పురోగతి కనిపించాలని అధికారులను ఆదేశించారు.