CM Revanth Reddy (Image Source: Twitter)
తెలంగాణ

CM Revanth Reddy: అందాల పోటీలపై సమీక్ష.. భద్రతపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణలో మిస్ వరల్డ్ – 2025 (Miss World 2025) పోటీలు ప్రతిష్టాత్మకంగా జరగనున్న సంగతి తెలిసిందే. ప్రపంచం నలుమూలల నుంచి మోడళ్లు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో జరిగిన ఈ భేటికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హజరయ్యారు. అందాల పోటీల కోసం చేస్తున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోటీల్లో పాల్గొనే పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

తెలంగాణలో మే 10 నుంచి మిస్ వరల్డ్ – 2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్.. పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. విభాగాలవారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని అదేశించారు.

Also Read: Jagga Reddy on KCR: కేసీఆర్, రేవంత్ లలో ఎవరు గొప్ప? లాజిక్ గా ఆన్సర్ ఇచ్చిన జగ్గారెడ్డి!

బ్యూటిఫికేషన్ పనులు ముమ్మరం

మరోవైపు అతిథులను ఆకర్షించేందుకు హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఫ్లై ఓవర్లకు రంగు రంగుల పెయింటింగ్స్ తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మిస్ వరల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Also Read This: BRS BJP Alliance: బీజేపీ – బీఆర్ఎస్ పొత్తు.. సభ వేదికగా కేసీఆర్ హింట్స్.. టార్గెట్ హైదరాబాద్!

టూరిజం శాఖ ప్లాన్స్

ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసే అతిథులకు సాదర స్వాగతం పలికేందుకు తెలంగాణ టూరిజం శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మే 10న గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ (Opening Ceremony) నిర్వహించనుంది. ఈ క్రమంలోనే మే 12న నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar) సమీపంలో ఉన్న బుద్ధ వనాన్ని పోటీదారులు సందర్శించేందుకు టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే మే 15న విదేశీ యువతులను ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి (Bhudan Pochampally)కి తీసుకెళ్లనున్నారు. అక్కడ ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతలను వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో సుప్రసిద్ధ కట్టడాలను సైతం వారికి చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?