Mobile Tips In Summer: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఏ పని చేయాలన్నా చేతిలో మెుబైల్ ఉండాల్సిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ ప్రతీ ఒక్కరూ సెల్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే మెుబైల్ యూజర్లను ప్రధానంగా వెంటాడే సమస్యల్లో ఫోన్ హీట్ ఇష్యూ ఒకటి. అన్ని కాలల్లోనూ మెుబైల్ యూజర్లను ఈ సమస్య వేధిస్తుంటుంది. ముఖ్యంగా సమ్మర్ లో ఈ ప్రాబ్లం మరింత ఎక్కువగా ఉంటుంది. ఓవర్ హీట్ కారణంగా కొన్నిసార్లు మెుబైల్స్ పేలిపోతున్న వార్తలు వింటూనే ఉన్నాం. కాబట్టి సమ్మర్ లో ఫోన్స్ హిట్ కాకుండే ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
ఎండలో మెుబైల్ వాడొద్దు
చాలామంది నడి ఎండలో తమ మెుబైల్స్ ను వినియోగిస్తుంటారు. అయితే ఇది చాలా డేంజర్. ఆరు బయట ఎక్కువసేపు మెుబైల్ ను వినియోగించడం ద్వారా త్వరగా హీట్ అయ్యే ప్రమాదముంది. కొన్నిసార్లు మెుబైల్స్ పేలిపోవచ్చు కూడా. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎండలో మెుబైల్స్ ఉపయోగించకపోవడమే బెటర్.
బ్యాక్ పౌచ్ తీసి చార్జింగ్
సాధారణంగా మనమందరం మెుబైల్ ను నేరుగా ఛార్జింగ్ పెడుతుంటాం. దానికి ఉన్న పౌచ్ ను అసలు తీయము. అయితే ఇలా చేయడం వల్ల మెుబైల్ హీట్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు సహజంగానే మెుబైల్స్ హిట్ ఎక్కుతాయి. ఆ సమయంలో ఆ హీట్ బయటకు వెళ్లకుండా బ్యాక్ పౌచ్ అడ్డుపడుతుంది. కాబట్టి ఇకపై ఆ తప్పు చేయవద్దు.
బ్యాక్ గ్రౌండ్ యాప్స్ క్లోజ్
కొందరు మెుబైల్స్ లో విపరీతంగా యాప్స్ డౌన్ లోడ్ చేస్తుంటారు. దీని వల్ల ఆ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. తద్వారా మెుబైల్ ప్రొసెసర్ పై భారం పెరిగి.. మెుబైల్ హీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఉపయోగం లేని యాప్స్ ను బ్యాక్ గ్రౌండ్ లో రన్ కాకుండా క్లోజ్ చేయండి. వీలైతే అన్ ఇన్ స్టాల్ చేస్తే మంచింది.
ఫీచర్స్ టర్న్ ఆఫ్
మెుబైల్స్ కొన్ని ఫీచర్లను అవసరం లేకున్నా కొందరు యాక్టివేట్ చేస్తుంటారు. బ్లూ టూత్, జీపీఎస్, వై-ఫై, మెుబైల్ డేటా వంటి ఫీచర్లను ఎప్పుడూ ఆన్ లో ఉంచుతూ ఉంటారు. దీని వల్ల మెుబైల్ ప్రొసెసర్ నిరంతరాయంగా రన్ అవుతూనే ఉంటుంది. తద్వారా ఫోన్ ను హీట్ చేస్తుంది. కాబట్టి అవసరం లేని ఫీచర్లను టర్న్ ఆఫ్ చేసుకుంటే హీట్ నుంచి మెుబైల్ ను కాపాడుకోవచ్చు.
అధిక వాడకాన్ని తగ్గించడం
చాలా మంది యూజర్లు.. మెుబైల్ ను అదే పనిగా ఉపయోగిస్తుంటారు. గేమ్స్ ఆడటం, 4K వీడియోలను రికార్డ్ చేయడం, వీడియో కాలింగ్ మాట్లాడటం వంటివి చేస్తుంటారు. పరిమితికి మించి ఇలా చేయడం ద్వారా మెుబైల్ హీట్ ఎక్కే ప్రమాదముంది. కాబట్టి కొంత సమయాన్ని కేటాయించుకొని మెుబైల్ ను ఉపయోగిస్తే హీట్ సమస్య తగ్గుతుంది.
Also Read: BRS BJP Alliance: బీజేపీ – బీఆర్ఎస్ పొత్తు.. సభ వేదికగా కేసీఆర్ హింట్స్.. టార్గెట్ హైదరాబాద్!
కారులో వదిలేయవద్దు
సాధారణంగా మెుబైల్స్ ను కొందరు కారులో వదిలేస్తుంటారు. అయితే కారు టెంపరేచర్ ఎప్పుడు వేడిగానే ఉంటుంది. ఒకే టెంపరేచర్ లో మెుబైల్ ను ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఫోన్ హీట్ ఎక్కి అందులోని కాంపోనెంట్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.
ఏరోప్లేన్ మోడ్
మెుబైల్ తో కొన్ని గంటల వరకూ అవసరం లేదని భావించిన సమయంలో సెల్ ఫోన్ ను ఏరోప్లేన్ మోడ్ లో పెట్టడం ఉత్తమం. అది మీ మెుబైల్ యాక్టివిటీని తగ్గించి.. హీట్ అవ్వకుండా జాగ్రత్త చేస్తుంది. తద్వారా ఫోన్ ప్రొసెసర్ పై భారం పడకుండా ప్రశాంతంగా ఉంచుతుంది.
చల్లని ప్రదేశాల్లో ఛార్జింగ్
ఛార్జింగ్ పెట్టే ప్రదేశం కూడా మెుబైల్ హీటింగ్ పై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. వేడిగా ఉండే ప్రాంతాల్లో మెుబైల్ ను ఛార్జ్ చేస్తే.. ఫోన్ హీటెక్కడం ఖాయం. కాబట్టి దానిని నివారించేందుకు చల్లని ప్రదేశాల్లో ఫోన్ ఛార్జ్ పెట్టేందుకు ప్రయత్నించాలి.