Degree Lectures (imagecredit:AI)
తెలంగాణ

Degree Lectures: డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల మనోవేదన.. రెండేండ్ల నుంచి సెలవులు కట్!

తెలంగాణ: Degree Lectures: రాష్ట్రంలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వేసవి ఎండలు మండుతున్నా సెలవులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్, రీ డిప్లాయిడ్, కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్ అయిన ఉద్యోగులకు సెలవులు ఇచ్చి డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు మాత్రం ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి రెండేండ్ల నుంచి తమకు ఎదురవుతోందని పలువురు డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు వాపోతున్నారు. అంతకుముందు సెలవులు యథావిధిగా ఉండేవని చెబుతున్నారు. విద్యార్థులు లేకుండా తాము కాలేజీలకు వెళ్లి ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 121 డిగ్రీ కళాశాలల్లో దాదాపు 466 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు సెలవుల్లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా ఇబ్బందులు పడుతున్నట్లు లెక్చరర్లు చెబుతున్నారు. ఈ అంశంపై గతంలోనే ఉన్న అధికారులకు వినతులు సమర్పించామని, అయినా ఎలాంటి స్పష్టత రాలేదని వాపోయారు. రాష్ట్రంలో కేజీబీవీ, వెలుగు, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు వేసవి సెలవులు ఇస్తున్నారని, కానీ కేవలం డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకు మాత్రమే రెండు సంవత్సరాలుగా వేసవి సెలవులు ఇవ్వడంలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇతర ఫ్యాకల్టీకి మే 1 నుంచి ఆనెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.

Also Read: Mahesh Kumar on KCR: కేసీఆర్.. దమ్ముందా? ఛాలెంజ్ అంటూ టీపీసీసీ చీఫ్ సవాల్!

ఈ సమస్యకు తోడు పలువురు డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు అక్రమ దారిలో బ్యాక్ డేట్ తో పీహెచ్ డీ సర్టిఫికెట్ తెచ్చుకుని దాదాపు 42 మంది రెగ్యులర్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమండ్లు చేస్తున్నారు. హైకోర్టు తీర్పుతో రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన 466 డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు, మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

పుండు మీద కారం చల్లినట్లు తీరు

రెగ్యులరైజేషన్ లో అన్యాయo జరిగి తీవ్ర మనస్థాపంతో ఉన్నాం. దానికి తోడు సెలవులు కూడా లేకపోవడంతో పుండు మీద కారం చల్లినట్టుగా మా పరిస్థితి మారింది. బానిస బతుకులుగా మారాయి. సెలవుల అంశంపై అధికారులను కలిసి వినతులు అందించాం. అయినా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పటికైనా మేం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపండి.
Also Read: CM Revanth On KCR: కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశారుగా!

 

Just In

01

Dheeraj Mogilineni: వేస్ట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌పై ‘ది గర్ల్ ‌ఫ్రెండ్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!

Prabhas: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ డౌటేనా?

Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!