practicing doctors (imagecredit:AI)
తెలంగాణ

practicing doctors: మత్తుకు బానిసలవుతున్న చిన్న డాక్టర్లు.. ఎక్కడంటే!

తెలంగాణ: practicing doctors: ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే మత్తు పదార్థాలకు బానిసలైతే ఈ ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అయితే, ఇదే జరుగుతోంది. కొంతకాలం క్రితం నార్కొటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్​ చేసిన ఓ హాష్​ ఆయిల్​ పెడ్లర్​ ను జరిపిన విచారణలో దిగ్ర్భాంతికరమైన ఈ విషయం వెలుగు చూసింది. వైద్యలుగా ప్రాక్టీస్​ చేస్తున్న వారితోపాటు మెడికల్​ స్టూడెంట్లు, సాఫ్ట్​ వేర్​ ఉద్యోగులు పలువురు నిషా కోసం ఈ హాష్​ ఆయిల్​ ను వాడుతున్నట్టుగా తెలిసింది.

గంజాయి ఆకులను ఆల్కహాల్​ తో కలిపి మరిగించటం ద్వారా ఈ హాష్​ ఆయిల్​ ను తయారు చేస్తారు. ఇటీవల రాచకొండ పోలీసులు ఓ గ్యాంగును అరెస్ట్​ చేసి 80 లక్షల రూపాయల విలువ చేసే హాష్​ ఆయిల్​ ను సీజ్​ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ కమిషనర్​ సుధీర్​ బాబు వివరాలు వెల్లడిస్తూ కిలో హాష్​ ఆయిల్​ తయారు చేయటానికి 40 నుంచి 50 కిలోల గంజాయి అవసరమవుతుందని చెప్పటం గమనార్హం.

నార్కొటిక్​ బ్యూరోకు చెందిన ఓ అధికారి చెప్పిన ప్రకారం నలుపు రంగులో చిక్కగా ఉండే ఈ హాష్​ ఆయిల్ ను రెండు మిల్లీ లీటర్లు తీసుకున్నా కనీసం ఎనిమిది గంటలపాటు సేవించిన వ్యక్తి మత్తులో ఉంటాడు. గతంలో సైదాబాద్​ పోలీసులతో కలిసి ఓ పెడ్లర్​ ను అరెస్ట్​ చేసినపుడు అతని కస్టమర్ల లిస్టులో పలువురు డాక్టర్లతోపాటు మెడికోలు, సాఫ్ట్​ వేర్​, ఇంజనీరింగ్​ విద్యార్థులు ఉన్నట్టుగా వెల్లడైందన్నారు.

Also Read: Maoists in Karregutta: కర్రెగుట్ట ప్రాంత గ్రామాల్లో టెన్షన్ టెన్షన్.. హిడ్మా, దేవా లే టార్గెట్!

కొంతమంది దీనిని చాయ్​ లో కలిపి తీసుకుంటుంటే మరికొందరు సిగరెట్లలోని పొగాకును బయటకు తీసి దాంట్లో రెండు మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్​ కలిపి తిరిగి సిగరెట్లలో నింపి సేవిస్తున్నట్టుగా తెలిసిందన్నారు. ఇంకొందరు నీళ్లను బాగా మరిగించి ఆ తరువాత దాంట్లో హాష్ ఆయిల్​ కలిపి దాని ఆవిరిని పీలుస్తున్నట్టు వెల్లడైందని చెప్పారు. కిలో నూనెను లక్ష నుంచి లక్షా 20 ‌వేల రూపాయలకు కొంటున్న పెడ్లర్లు అయిదు మిల్లీ లీటర్ల చొప్పున చిన్న చిన్న సీసాల్లో నింపి ఒక్కో సీసాను 3 వేల నుంచి 4వేల రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు. ఈ మాదకద్రవ్యం ఎక్కువగా విశాఖ ఏజన్సీ ప్రాంతం నుంచి వస్తోందని చెప్పారు.

వంద కిలోల గంజాయి తీసుకు రావటంకన్నా నాలుగైదు కిలోల హాష్ ఆయిల్ ను తీసుకు రావటం సులభం కాబట్టి దీనిని స్మగుల్​ చేసి ఇక్కడకు తెస్తూ అమ్ముతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని తెలిపారు. ఇక, హాష్​ ఆయిల్​ మత్తులో ఉన్న సమయంలో దానిని తీసుకున్న వ్యక్తికి స్వీయ నియంత్రణ ఉండదని సీనియర్​ జనరల్ ఫిజీషియన్​ డాక్టర్​ విజయ్ కుమార్​ చెప్పారు. హాష్​ తీసుకున్న వారు హలోషన్ లోకి వెళ్లిపోతారని వేగంగా స్పందించ లేరన్నారు.

Also Read: Pahalgam Terror attack: పాక్ పై భారత్ ఆంక్షలు.. పాకిస్థాన్ లో ఇప్పుడు లీటర్ వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా ?

దీనికి కారణం హాష్​ ఆయిల్​ ప్రభావం చిన్న మెదడుపై తీవ్రంగా ఉండటమే అని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మత్తుకు అలవాటు పడ్డ డాక్టర్లు రోగులను చూడటమంటే వారి ప్రాణాలతో చెలగాటాలాడినట్టే అని చెప్పారు. ఇక, హాష్​ ఆయిల్​ ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్​, గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. దీనిని తీసుకోవటం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుందని చెబుతూ దీనిల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నారు.

ఊపిరితిత్తులపై కనబరిచే ప్రభావం వల్ల ఊపిరి తీసుకోవటం కష్టమవుతుందని వివరించారు. ఈ మత్తు పదార్థాన్ని సేవించిన వారిలో యాంగ్జయిటీ కూడా పెరిగిపోతుందని చెప్పారు. కొన్నిసార్లు మత్తులో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తాయన్నారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు