KCR Speech (image credit:Twitter)
తెలంగాణ

KCR Speech: ప్రజల్లోకి వస్తున్నా.. ఇక ఊరుకోను.. కేసీఆర్

KCR Speech: బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూసినా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నదని మాజీ సీఎం కెసిఆర్ అన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు భారీగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ముందుగా సభ వేదిక వద్దకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఆ తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ కేసిఆర్ కేసీఆర్ హెలికాఫ్టర్ గుండా ఎల్కతుర్తికి చేరుకున్నారు. ఈ సంధర్భంగా సభా వేదికకు వచ్చిన కేసీఆర్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత కేసీఆర్ స్వయంగా మైక్ తీసుకొని, కాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన మనవారు 28 మంది మృతికి సంతాప సూచకంగా మౌనం పాటిద్దామని కోరారు. దీనితో అందరూ లేచి నిలబడి మౌనం పాటించారు.

ఆ తర్వాత కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కెసిఆర్ మాట్లాడుతూ.. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్కడినే వెళ్ళాను. అలా వెళ్లి నేడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. 25 ఏళ్ల నుండి ఎగిరిన జెండా గులాబీ జెండా అంటూ పేర్కొన్న కెసిఆర్, ఎందరో అవమాన పరిచారని, కానీ ఈ జెండాను ఎందరో త్యాగాలు చేసి, పోరాటంతో కాపాడుకున్నారని తెలిపారు. ప్రజలు దీవిస్తే తెలంగాణను పదేళ్ళు పాలించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు.

టిడిపి పెద్ద తతంగమే నడిపింది
1969లో మూగబోయిన తెలంగాణకు జీవం పోసిన ఘనత గులాబీ జెండా అంటూ కెసిఆర్ అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిందని, అది చివరికి ఫలించిందన్నారు. ఉద్యమం నుండి వెనక్కు వస్తే, నన్ను రాళ్ళతో చెప్పండి అంటూ తాను ఉద్యమ సమయంలో పిలుపునిచ్చిన విషయాన్ని కెసిఆర్ గుర్తు చేశారు. గోదావరి నీళ్లు తరలిపోతుంటే టిడిపి, కాంగ్రెస్ నాయకులు ఎవరూ అడ్డుకోలేదని, తాము ఎదురొడ్డి పోరాటం చేశామన్నారు.

పదవుల కోసం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు జలాలను తరలించారని, అలాగే ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాడు తెలంగాణ పదాన్ని నిషేధించాలని చూశారన్నారు. తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ అంటూ కెసిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినామని నమ్మబలికి, పార్టీతో కలిసేందుకు వచ్చారని, చివరకు మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణను కేవలం రాజకీయ అవసరం కోసమే ఇచ్చారని కెసిఆర్ చెప్పుకొచ్చారు.

Also Read: BRS Party Silver Jubilee: బీఆర్ఎస్ సభలో మరో పార్టీ జెండాలు.. సోషల్ మీడియాలో వైరల్..

పదేళ్లు అధికారంలో ఉండి, ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. ఆదాయాన్ని పెంచామని, దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చినట్లు చెప్పారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామని కెసిఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమని చెప్పారని, నాటి ఆంధ్ర పాలకులు ఆశ్చర్య పోయేలా తాము పరిపాలించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో అబద్దపు హామీలు ఇచ్చారన్నారు. ఆ హామీలు ఏమయ్యాయని కెసిఆర్ ప్రశ్నించారు.

ఆ హామీలెక్కడ?
అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఎన్నో మాటలు చెప్పిందని, నేడు నీరు కూడా అందని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. కాంగ్రెస్ కు ఏడాది పాలన ఇవ్వాలని ఇచ్చానని, తాను అందుకోసమే బయటికి రాలేదన్నారు. మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని దీనికి ఎవరు భాద్యత వహిస్తారన్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆ పథకాన్ని తాను మెచ్చుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని అలాగే సాగించామన్నారు.

సభకు వచ్చేవారిని అడ్డుకున్నారు
సభకు వచ్చే ప్రజలను అడ్డుకున్నారని, సభకు వచ్చే వారు ఇంకా లక్షల మంది బయట ఉన్నారని కెసిఆర్ తన ప్రసంగంలో ఉటంకించారు. ప్రజాస్వామ్యంలో అడిగే హక్కును పోలీసులు కాలరాస్తున్నారని, సోషల్ మీడియాలో పని చేసే వారిని కేసులు నమోదు చేయడం తగదన్నారు. పోలీసులూ మీ డైరీలలో రాసుకోండి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అంటూ పోలీసులను కెసిఆర్ హెచ్చరించారు. పోలీసులు.. మీ డ్యూటీ మీరు చేయండి. అంతేకానీ న్యాయపరంగా పోరాడుతున్న వారిని అరెస్ట్ చేస్తే సహించేది లేదన్నారు. ఇక మున్ముందు తాను ప్రజల్లోకి వస్తున్నానని కెసిఆర్ అన్నారు.

Also Read: Ramakrishna Rao: తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు!

11 రూపాయలు కేంద్రం ఇవ్వలేదు
కాంగ్రెస్ అన్నింటిలో ఫెయిల్ అయిందని, దేనిలో పాస్ అయిందో చెప్పాలన్నారు. బిజెపి రాష్ట్రానికి 11 రూపాయలు ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిందా అంటూ కెసిఆర్ ప్రశ్నించారు. నక్సలైట్ల ప్రతిపాదనను పరిగణలోకి తీసుకొని వెంటనే కేంద్రం చర్చలు జరపాలని కెసిఆర్ కోరారు. ఆపరేషన్ కగార్ ఆపాలన్న ఉద్దేశంతో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు కెసిఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో అద్భుతమైన తెలంగాణ తయారు చేసుకుందామని, అందుకు ప్రజలు మద్దతు పలకాలన్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు