Babloo Prithiveeraj: మూవీ ఈవెంట్ కు పిలిచి.. అవమానిస్తారా? బబ్లూ పృథ్వీరాజ్ కామెంట్స్
Babloo Prithiveeraj ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Babloo Prithiveeraj: మూవీ ఈవెంట్ కు పిలిచి.. అవమానిస్తారా? బబ్లూ పృథ్వీరాజ్ కామెంట్స్

Babloo Prithiveeraj: తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన బబ్లూ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ‘యానిమల్’ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చి వరుసగా వచ్చిన అవకాశాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, అర‍్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీస్ లో నటించి తన మార్క్ ను చూపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రియల్ లైఫ్ లో తనకెదురైన చేదు అనుభవాన్ని బయటకు వెల్లడించాడు.

ఆయన తన  లైఫ్ లో చూడకూడని కష్టాలన్నీ చూశానని చెప్పాడు. అలాగే, ఈ 50 ఏళ్ళలో ఎన్నో అవమానాలు పడ్డాను. ఇప్పుడు నేను చూడాలనుకున్న స్టార్ డమ్ ను చూసాను. మంచిగా ఎంజాయ్ చేస్తున్నానని సంతోషంగా నవ్వుతూ  చెప్పాడు. పెళ్లి సినిమాకి  నంది అవార్డు తీసుకున్న మీరు, మళ్లీ సినిమాల్లో ఎందుకు కనిపించలేదు ఆ గ్యాప్ లో ఏం జరిగింది అని యాంకర్ అడగగా బబ్లూ పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

Also Read: King Nagarjuna: ఉగ్రవాదులతో నాగార్జునకు సంబంధం? ఆధారాలతో నా అన్వేష్ సంచలన వీడియో!

ఆయన మాట్లాడుతూ ” ఈ ప్రపంచంలో బెస్ట్ యాంకర్ అంటే నేనే అని ధైర్యంగా చెప్పాడు. నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన కూడా వంద కాదు 200% న్యాయం చేస్తాను. నాకు తెలుగు రాదు. కానీ, నేర్చుకుని చెప్పాలన్నా కూడా చాలా కష్టమే. నేను ఎంత యాక్ట్ చేసిన ఆ సీన్ రాలేదంటే ? అది నాకు అవమానమే కదా అన్నాడు.

Also Read:  Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో.. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తోంది?

ఇంకా మాట్లాడుతూ తనకి జరిగిన అవమానాన్ని కూడా అందరితో పంచుకున్నాడు ” 2024 లో గతేడాది మన ముందుకొచ్చిన ఉత్సవం చిత్రంలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశా. అయితే, ఈ సినిమ ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ కావాలంటూ కాల్ వచ్చింది. అప్పటికి నేను చాలా బిజీగా ఉన్నా.. కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లో ఉంటే పర్మిషన్ తీసుకుని మరి అక్కడికి వెళ్ళా. ఈవెంట్ కి వెళ్ళాక నన్ను దర్శకనిర్మాతలు పలకరించలేదు. నేను పలకరిస్తే సరిగా పట్టించుకోలేదు. బిజీగా ఉన్నారేమో వదిలేసి నేను ముందు సీట్ లో కూర్చున్నాను. అలా కొత్త వాళ్లొచ్చిన ప్రతిసారి నన్ను పక్కకు జరుపుకుంటూ మూలకి నెట్టేస్తే చివరకెళ్లిపోయా ” అంటూ బబ్లూ పృథ్వీరాజ్ చాలా ఎమోషనల్ అయ్యారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..