BRS Rajathotsavam: మాజీ సీఎం కేసీఆర్ మాటేంటి? అసలేం చెప్పబోతున్నారు?
BRS Rajathotsavam ( Image Source: Twitter)
Telangana News

BRS Rajathotsavam: మాజీ సీఎం కేసీఆర్ మాటేంటి? అసలేం చెప్పబోతున్నారు?

BRS Rajathotsavam: వరంగల్ మొత్తం గులాబీల మయమైంది. ప్రస్తుతం, ఎక్కడ చూసిన జెండాలే కనిపిస్తున్నాయి. 14ఏళ్ల ఉద్యమంలో పోరాటం చేసి, పదేళ్ల అధికారంలో ప్రజలకు ఎన్నో సేవలను చేసింది. అధికారం లేకపోతే ఏంటి ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రజలకు అండగా ఉంటామంటూ ఇచ్చిన మాట నిలబడి బీఆర్‌ఎస్‌ పేరును కాపాడుకుంది. తెలంగాణ కోసం 2001 ఏప్రిల్ 27న పార్టీని స్థాపించిన కేసీఆర్.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి రోజుకి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో రజతోత్సవ సభను వైభవంగా చేయాలనీ ప్లాన్ చేసింది.

Also Read:  Mulugu District: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందా.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్!

బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీకి హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి వద్ద సాయంత్రం 4.30గంటలకు జరిగే భారీ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. రజతోత్సవ సభ పండుగ వాతావరణాన్ని తెచ్చింది. కేసీఆర్ పై అభిమానం చూపుతూ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవ్వనున్నారు. సభతో తన బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశం మొత్తానికి చూపించేందుకు రెడీ అవుతోంది. దీని కోసం మొత్తం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేయనున్నారు. 5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 500 మంది ముఖ్య నేతలు వేదిక పైన కూర్చొనేందుకు తయారు చేశారు. అలాగే, వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని కేటాయించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన 17 మంది రైతులు ఎడ్లబండ్లలో 6 రోజులుగా, 140 కిలో మీటర్లు ప్రయాణం చేసి సభ వద్దకు చేరుకున్నారు.

అందరి చూపు కేసీఆర్ పైనే

సభ ఏర్పాట్లు అయితే అదిరిపోయాయి. కానీ, అందరి చూపు కేసీఆర్ స్పీచ్‌ పైనే ఉంది అతను ఏం మాట్లాడతారో? అని రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పాలన, పథకాల అమలు, కాంగ్రెస్ నేతల విమర్శలు ఇలా అన్నింటిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన ప్రణాళికలను కూడా వేదికపైనే కేసీఆర్ చెప్పే అవకాశం కనిపిస్తుంది.

కేసీఆర్ సైకత శిల్పాన్ని చేయించిన ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి

బీఆర్‌ఎస్ రజతోత్సవ సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారి మీద అభిమానంతో, ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ఒడిశాలోని పూరీ గోల్డెన్ బీచ్‌లో సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పంలో ” కేసీఆర్ మా కోసం మీరు నిలబడ్డారు, మీ కోసం మేము నిలబడతాం” అనే సందేశంతో పాటు బీఆర్‌ఎస్ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన వివరాలను ఆయన మాటల్లో చెప్పారు.

కేసీఆర్ సైకత శిల్పాన్ని రూపొందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. పార్టీ ప్రస్థానాన్ని వివరించేలా సైకత శిల్పం బాగా ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒడిశాలోని పూరీ గోల్డెన్ బీచ్‌లో ప్రముఖ సైకత శిల్పకళాకారుల ఆధ్వర్యంలో దీనిని రూపొందించినట్లు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వివరించారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..