Uttam Kumar Reddy( image credit: twitter)
తెలంగాణ

Uttam Kumar Reddy: ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబాటు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి!

Uttam Kumar Reddy: ప్రపంచ వ్యాప్తంగా ఉదారవాద విలువలకు పెను ప్రమాదం పొంచి ఉన్నదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.స్వేచ్ఛ, బావప్రకటన, కళలు, విద్యారంగంతో పాటు సమావేశాలు,నిరసనలు వంటి మౌలిక స్వేచ్ఛ లపై నియంతృత్వ ప్రభుత్వాలు దాడులు జరుపుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరిగిన సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ…ఉదారవాద ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.

ప్రపంచం నలుమూలల నుండి మేధావులు, ఉద్యమ కారులు,ప్రజాస్వామ్య వాదులు పెద్ద సంఖ్యలో తరలి రావడం ఈ సదస్సు ప్రత్యేకతగా ఆయన అభివర్ణించారు. స్వేచ్ఛ,స్వాతంత్ర్యలను కాపాడడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. గడిచిన రెండురోజులుగా జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచ న్యాయం, తప్పుడు సమాచార వ్యాప్తి, లింగ వయో వివక్ష వంటి కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చినట్లు ఆయన వెల్లడించారు.యావత్ ప్రపంచం నలుమూలల నుండి 100 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు హాజరై తమ తమ ఆలోచనలను సదస్సులో పంచుకున్నారన్నారు.

 Also Read: Rahul Gandhi Speech: పాత తరానికి వీడ్కోలు, కొత్త నాయకత్వానికి స్వాగతం.. రాహుల్ గాంధీ!

సమకాలీన సవాళ్ళను ఎదుర్కోవడానికి గాను భారత శిఖరాగ్ర సమావేశం-2025 ద్వారా చక్కటి సందేశాన్ని అందించగలిగామన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉత్పన్నమయిన పరిస్థితిలపై ప్రజలందరూ నైరాశ్యంలో ఉన్నప్పటికీ ఈ శిఖరాగ్ర సమావేశంతో సరికొత్త ఆశలు చిగురించాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డికాభివృద్ది,సామాజిక న్యాయం సాధిస్తుందన్నారు.

అసమానతలపై ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. నిర్లక్ష్యంగా వ్యహరిస్తే విభజన,నియంతృత్వం కోరుకునే వారికి అనుకూలంగా మారుతుందన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా నిలిచిందని ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు బారులు తీరుతున్నారన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు