Serial Actress: ఈ సీరియల్ నటికి ఫుడ్ వద్దంట కానీ, లవర్.. అతనితో ముద్దు, అలాగే బెడ్ కావాలని సిగ్గు లేకుండా చెప్పేసింది. ఇంతకీ ఎవరా సీరియల్ నటి? ఏమా కథ? అని అనుకుంటున్నారా? ఆహా ఓటీటీలో ‘కాకమ్మకథలు’ అనే షో ఒకటి జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షో ప్రస్తుతం రెండో సీజన్‌కు చేరుకుంది. తేజస్విని మదివాడ హోస్ట్ చేస్తున్న ఈ షోకు తాజాగా ఓ సీరియల్ నటి హాజరైంది. ఆమెకు నాలుగు పదాలు ఇచ్చి.. ఒక సెంటెన్స్ ఫార్మ్ చేయాలని చెప్పింది తేజస్విని. అందుకు ఆ సీరియల్ నటి.. సిగ్గులేకుండా లవర్‌తో ముద్దు, బెడ్ కావాలని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సీరియల్ నటి పేరు చెప్పలేదు కదా. బుల్లితెరపై యమా యాక్టివ్‌గా ఉంటూ, లొడా లొడా వాగేసే నటి దీపికా రంగరాజు (Serial Actress).
Also Read- Samuthirakani: బర్త్‌డే స్పెషల్‌గా ‘కాంత’ నుంచి ఫస్ట్ లుక్.. వేరే లెవల్ అంతే!
దీపికా రంగరాజుకు వసపిట్ట అని కూడా పేరుంది. ఎందుకంటే, ఆమె పక్కన ఉంటే చెవులు మూసుకుని ఉండాలి, లేదంటే ఆమెకు దూరంగా అయినా ఉండాలి. అలా నాన్‌స్టాప్‌గా దీపికా బిగ్గరగా మాట్లాడుతూనే ఉంటుంది… సారీ అరుస్తూనే ఉంటుంది. ఆ విషయం ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’ చూస్తేనే తెలుస్తుంది. ఈ షోలో న్యాయ నిర్ణేతలు కాకుండా, 5గురు కంటెస్టెంట్‌లను లీడ్ చేయడానికి 5గురు మెంటర్స్‌ని ఓంకార్ ఏర్పాటు చేశారు. అందులో దీపికా రంగరాజు కూడా ఒక మెంటర్‌గా ఉన్నారు. తన కంటెస్టెంట్ డ్యాన్స్ పూర్తయిన తర్వాత దీపికా చేసే అల్లరికి జడ్జ్ శేఖర్ మాస్టర్ కూడా చెవులు మూసేసుకుంటారంటే, ఏ రేంజ్‌లో ఆమె టార్చర్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక యష్ మాస్టర్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.
నా సీటు మార్చండి అంటూ షో మొదలైనప్పటి నుంచి, ఆయన ఓంకార్‌ని అడుగుతూనే ఉన్నారు. అయినా కూడా ఆమె పక్క సీట్లోనే కూర్చోవాల్సి రావడంతో, చాలా సార్లు ఆయన అన్‌ఈజీగా ఫీలయ్యారు. ఇక ‘కాకమ్మకథలు’ సీజన్ టు విషయానికి వస్తే.. ఈ షో హోస్ట్ తేజస్వి మదివాడ పచ్చిగా గెస్ట్‌లను ప్రశ్నలు అడుగుతుంటుంది. ముఖ్యంగా శృంగార పరమైన ప్రశ్నలతో ఎక్కువగా టెంప్ట్ చేస్తుంటుంది. అలా, దీపికాకు లవర్, లండన్, ఫుడ్, బెడ్.. ఈ పదాలను కలుపుతూ ఒక వాక్యం చెప్పమని సూచించింది. దీనికి దీపికా రంగరాజు చెప్పింది విని, ఒక్కసారిగా క్లాప్స్ కొట్టేసింది తేజస్వి. ఇంతకీ దీపికా ఏం చెప్పిందని అనుకుంటున్నారా..
Also Read- Simran: ‘ఆంటీ రోల్స్’ అంటూ చులకనగా మాట్లాడిన నటిపై మరోసారి సిమ్రన్ షాకింగ్ కామెంట్స్
‘‘నా సిక్త్స్ లవర్‌తో లండన్ బ్రిడ్జిపై అందరూ చూస్తుండగా, అసలు సిగ్గులేకుండా, అన్నీ మరిచిపోయి ముద్దులు ఇస్తే.. నాకు ఫుడ్ కూడా అవసరం లేదు’’ అని దీపికా చెప్పగా.. మరి బెడ్ సంగతి ఏంటి? అని తేజస్వి అడిగింది. దీనికి దీపికా మళ్లీ.. ‘ఫుడ్ కూడా అవసరం లేదు.. కానీ, నిలుచుని నిలుచుని అలసిపోతాను కదా.. కాబట్టి లండన్ బ్రిడ్జి ముందు బెడ్ అవసరం’ అని చెప్పగానే, వావ్ అంటూ తేజస్విని ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి నెటిజన్లు అదేంటి అంత పచ్చగా, అలా ఎలా చెప్పేసింది? అని కొందరు అంటుంటే.. భలే మ్యానేజ్ చేసిందిగా అంటూ దీపికా సమయస్ఫూర్తిని కొందరు మెచ్చుకుంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు