Samuthirakani
ఎంటర్‌టైన్మెంట్

Samuthirakani: బర్త్‌డే స్పెషల్‌గా ‘కాంత’ నుంచి ఫస్ట్ లుక్.. వేరే లెవల్ అంతే!

Samuthirakani: సముద్రఖని ఈ పేరు తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన సముద్రఖని కోలీవుడ్‌కు చెందిన నటుడు. అయినప్పటికీ ఆయన అన్ని భాషల చిత్రాలలో నటిస్తున్నారు. మధ్యమధ్యలో డైరెక్షన్ చేస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Power Star Pawan Kalyan) ను కూడా ఆయన డైరెక్ట్ చేశారు. ‘బ్రో’ (Bro) పేరుతో ఆయన రూపొందించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణనే రాబట్టుకుంది. అలాగే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలో సముద్రఖని నటనకు జనాలు నీరాజనాలు పలికారు. అప్పటి నుంచి ప్రత్యేకంగా ఆయన కోసం పాత్రలు రాస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం ఆయన కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌లో బిజీ యాక్టర్‌గా కొనసాగుతున్నారు.

Also Read- Simran: ‘ఆంటీ రోల్స్’ అంటూ చులకనగా మాట్లాడిన నటిపై మరోసారి సిమ్రన్ షాకింగ్ కామెంట్స్

రొటీన్ పాత్రలు కాకుండా, అన్నిరకాల పాత్రలతో సముద్రఖని తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్నాడు. అందుకే, సముద్రఖని లేకుండా సినిమా ఉండటం లేదు. ఒకప్పుడు ప్రకాశ్ రాజ్ ఎలా అయితే బిజీ యాక్టర్‌గా ఉన్నారో.. ఇప్పుడు సముద్రఖని కూడా అదే స్థాయిలో అవకాశాలను పొందుతున్నారు. ఆయన కూడా దర్శకుడు కావడంతో, దర్శకులు ఏ పాత్ర ఇచ్చినా, ఆ పాత్రలో సముద్రఖని ఒదిగిపోతున్నారు. అందుకే దర్శకుడు సముద్రఖని కోసం ప్రత్యేకంగా దర్శకుడు పాత్రలు రాస్తున్నారు. ఇక ఏప్రిల్ 26 సముద్రఖని పుట్టినరోజు (HBDSamuthirakani). ఈ సందర్భంగా ఆయన నటించిన చిత్రాలలోని ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఈ పోస్టర్స్‌లో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘కాంత’ (Kaantha) చిత్రం నుంచి వచ్చిన సముద్రఖని ఫస్ట్ లుక్ వేరే లెవల్ అన్నట్లుగా ఉంది.

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కాంత’. అద్భుతమైన స్టార్ కాస్ట్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ ఛాన్స్‌ని దక్కించుకుంది. సినిమా మెయిన్ కాన్సెప్ట్ మొత్తం ఆమె పాత్రపైనే ఉంటుందనేది టైటిల్‌తో అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, తాజాగా సముద్రఖని బర్త్‌డే‌ని పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా సినిమాపై క్రేజ్‌ని పెంచుతోంది. సముద్రఖని ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో వైవిధ్యభరితంగా ఉంది.

Also Read- Actress: నాడు హీరోయిన్.. నేడు ఐటీ ఉద్యోగి.. కోట్లల్లో శాలరీ.. అదెలా?

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సముద్రఖనిని గమనిస్తే.. మోనోక్రోమ్ ప్యాలెట్‌లో ఆయన ఫెరోషియస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్, ఈ సినిమా కాల నేపథ్యాన్ని తెలియజేస్తుంది. అతని ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‌తో స్టైలింగ్, అతని పాత్ర కథనంలో పవర్ ఫుల్‌గా ఉంటుందని సూచిస్తుంది. ఈ ఫొటోతో చిత్రయూనిట్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!