Heatwave In AP(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Heatwave In AP: అగ్ని గుండంలా రాష్ట్రం.. వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!

Heatwave In AP: శనివారం (26-04-25) శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, లక్ష్మీనరసుపేట, పాతపట్నం, విజయనగరం జిల్లా సంతకవిటి, పార్వతీపురంమన్యం జిల్లా గరుగుబిల్లి, పాలకొండ మండలాల్లో తీవ్రవడగాలులు, 28 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం 4 మండలాల్లో తీవ్ర, 17మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

శ్రీకాకుళం-1, విజయనగరం-15, పార్వతీపురంమన్యం -9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

శుక్రవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 42.9°C

నంద్యాల జిల్లా గాజులపల్లె, తిరుపతి జిల్లా వెంకటగిరిలో42.5°C, కర్నూలు జిల్లా లద్దగిరి, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 42.4°C, అన్నమయ్య జిల్లా వత్తలూరు, విజయనగరంలో 42°C
చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, అలాగే 169 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు.

Also read: Ramya Gopal: అలేఖ్య చెల్లి ఎంటర్.. అంత మాట అనేసిందేంటి?

బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదు.

వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఉరుములతో కూడిన అకాల వర్షాలు పడేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదన్నారు.

వడగాలులు వీచే మండలాల వివరాలు లింక్ లో చూడండి https://apsdma.ap.gov.in/files/ea563ec668ecbee1194783dc14d72f63.pdf

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ