తెలంగాణ: Board of Intermediate: ఇంటర్ లో తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం సబ్జెక్టును ప్రవేశపెట్టడం లేదని ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య, ఇంటర్ ఆర్జేడీ జయప్రదబాయి తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి చెందిన పలువురు తెలుగు ప్రొఫెసర్లు ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్యను కలిశారు.
ప్రభుత్వ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజీగా తెలుగును కంటిన్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హెచ్ సీయూ తెలుగు హెచ్ఓడీ పిల్లలమర్రి రాములు, మాజీ హెచ్ఓడీ దార్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోట్లాదిమంది ప్రజల మాతృభాషగా ఉన్న తెలుగును నిత్య వ్యవహారంలో ఒక భాగమని తెలిపారు. ఇతర సబ్జెక్టుల మాదిరిగానే విజ్ఞానాన్ని అందించే ఒక సబ్జెక్టు తెలుగు అని, అలాంటి తెలుగును నిర్లక్ష్యపరిచే చర్యలు సరికావాలని చెప్పారు.
Also Read: Akhanda 2 Thandavam: అనుమానాల మధ్య అదిరిపోయే అప్డేట్ వచ్చిందోచ్..
దీనిపై స్పందించిన కృష్ణ ఆదిత్య, జయప్రదబాయి టీజీపీఎస్సీ ద్వారా పది సంస్కృతం పోస్టులను భర్తీ చేయడం కోసం ఏయే కాలేజీల్లో ఖాళీలున్నాయనే అంశంపై సమాచారం అడిగామని, అంతేకానీ తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం ప్రోత్సహించే ఉద్దేశమే లేదని వారు స్పష్టంచేశారు.