Kaleswaram Project (imagecredit:twitter)
తెలంగాణ

Kaleswaram Project: కాళేశ్వరం బీఆర్ఎస్ సొంత జాగీర్ కాదు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ: Kaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను గుర్తించి అందుకు బాద్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ అంశంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని, బాధ్యులైన వారికి శిక్షలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన రూపకల్పన,నిర్వహణ లోపాలు బయట పడ్డాయని, నిర్మాణం చేసినవారు.. చేయించినవారు రైతులకు ద్రోహం చేశారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఎన్డీఎస్ఏ(నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ)రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై మంత్రి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికతో ప్రజల ఎదుట బీఆర్ఎస్ పార్టీ దోషిగా నిర్దారణ అయ్యిందనిపేర్కొన్నారు.

బీఆర్ఎస్ పాలనలో జరిగిన కాళేశ్వరం నిర్మాణం అంశంపై అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ వెలువరించిన నివేదికే ఇందుకు అద్దం పడుతోందన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ నిర్మించారని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి బీఆర్‌ఎస్ సిగ్గుపడాలన్నారు. మీరే డిజైన్ చేశారు మీరే కట్టారు మీరుండగానే కూలిపోయింది అని మండిపడ్డారు.

Also Read: Bharat Summit 2025: రాహుల్ గాంధీ ఆలోచనలకు ప్రతిరూపంగా భారత్ సమ్మిట్.. టీపీసీసీ చీఫ్!

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ లు ఎందుకూ పనికి రాకుండా పోయినా ఆ నిర్మాణాలు తమ గొప్పతనమని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీలతో లక్ష కోట్లు రుణం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని దుయ్యబట్టారు. ఇంత జరిగాక కూడా బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలు, తప్పులపై బతకాలని బీఆర్ఎస్ అనుకుంటుందని అది కుదరదని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ బీఆర్ఎస్ సొంత జాగీర్ కాదని,ప్రజాధనంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక పై సమగ్రమైన అధ్యయనం చేసిన మీదట తదుపరి చర్యలకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మితమైన ఈ ప్రాజెక్టు రైతుల కోసం నిర్మించింది ఎంత మాత్రం కాదని నాటి అధికార పార్టీ నేతలు జేబులు నింపు కోవడానికే దీనిని వినియోగించుకున్నారని ఎద్దేవాచేశారు.

ఎన్‌డీఎస్‌ఏ‌ను రేవంత్ రెడ్డినో నేనో వేసింది కాదు దేశంలో బెస్ట్ ఎక్స్‌పర్ట్స్‌ ఎన్‌డీఎస్‌ఏలో ఉన్నారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్‌డీఎస్‌ఏ వచ్చిందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టుపై పూర్తిగా అధ్యయం చేస్తామన్నారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారెజ్ లు నిరుపయోగంగా మారాయన్నారు. అయినా రాష్ట్రంలో దాన్యం దిగుబడి రికార్డు సృష్టిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం విషయంలో అనుసరించిన విధానాలు మాత్రమే దోహద పడ్డాయని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: AIMIM Wins In Elections: హైదరాబాద్ లో బిజెపికి బిగ్ షాక్.. గెలిచిన ఎంఐఎం

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు