Bharat Summit 2025: భారత్ సమ్మిట్ ప్రపంచానికే రోల్ మోడల్ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆయన హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ, భారత్ సమ్మిట్‌కు 100 దేశాలకు పైబడిన ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలతో కలిపి 450 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నదన్నారు.
పెట్టుబడులు, డెవలప్‌మెంట్, దేశ రక్షణ, తదితర అంశాలపై డిబేట్లు జరుగుతాయన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులను వివిధ అంశాలపై రెండు రోజులపాటు చర్చించేందుకు ఆహ్వానించిందన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు