తెలంగాణ: Ponguleti Srinivasa Reddy: అధికార దుర్వినియోగం పలుకుబడి కోసం తన పేరును ఎవరైన వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తన పీఏలు అంటూ అమాయకులను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారని వెల్లడించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకట్ రెడ్డి(వయస్సు 34), మచ్చ సురేశ్(వయస్సు 30) లు తన పీఏ లంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపి ఇద్దరినీ అరెస్ట్ చేశారన్నారు. ఇక తన పీఏలంటూ ఎవరనై ఫోన్ చేసినా, చిన్న అనుమానం కలిగినా వెంటనే సచివాలయంలోని తన కార్యాలయం 040-23451072 / 040-23451073 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.
Also Read: Fake Liquor: మందు బాబులు జర భద్రం.. మీరు తాగేది మద్యమేనా?