Pawan Kalyan – Varma: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan).. తన నియోజకవర్గమైన పిఠాపురం (Pithapuram)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే గత కొన్ని రోజులుగా స్థానిక టీడీపీ నేత ఏవీఎస్ఎన్ వర్మకు.. పవన్ తో పడటం లేదన్న వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జనసేన (Janasena)కు ఆయనకు గ్యాప్ పెరిగిందన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ క్రమంలోనే నాగబాబు పర్యటనకు సైతం వర్మ దూరంగా ఉండటంతో అది నిజమేనని అంతా భావించారు. అయితే తాజాగా పవన్ పిఠాపురం పర్యటనలో వర్మ కనిపించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తొలుత కానరాని వర్మ
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తొలుత చేబ్రోలు గ్రామంలో నిర్మించతలపెట్టిన టీడీపీ కల్యాణ మండపం, శ్రీ సీతారామస్వామి ఆలయంలో రథశాల నిర్మాణం, ఆలయ కాలక్షేప మండపం, ఆలయ ప్రాకారాల నిర్మాణానికి పవన్ శుంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పవన్ యాత్రలోని తొలి రెండు కార్యక్రమాల్లో వర్మ కనిపించలేదు. దీంతో వర్మ సమస్య మళ్లీ మెుదటికి వచ్చినందని అంతా భావించారు.
వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.#Pithapuram #AndhraPradesh pic.twitter.com/EkYRH43ekP
— JanaSena Shatagni (@JSPShatagniTeam) April 25, 2025
వర్మ సడెన్ ఎంట్రీ
చేబ్రోల్ గ్రామం నుంచి పిఠాపురం టౌన్ కు వచ్చిన పవన్ కల్యాణ్.. అక్కడ 30 గదులతో కూడిన 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే సందర్భంగా వర్మ ప్రత్యక్షం కావడం జనసేన కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. శంకుస్థాపన అనంతరం వర్మకు పవన్ కల్యాణ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. అనంతరం మాట్లాడిన పవన్.. ఎన్నికల హామీని ఈ ఆస్పత్రి శంకుస్థాపన ద్వారా నిలబెట్టుకోబోతున్నట్లు చెప్పారు. పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు కొత్త బ్లాకులు, ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్ , నూతన డెర్మటాలజీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, పేథాలజీ, ENT డిపార్ట్ మెంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
పిఠాపురం టౌన్ లో 30 గదులతో కూడిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం శంకుస్థాపన చేసిన గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan
గారు.#Pithapuram #AndhraPradesh pic.twitter.com/v21whv6SjA— JanaSena Shatagni (@JSPShatagniTeam) April 25, 2025
పవన్ సాయం
అంతకుముందు ఆస్పత్రి శంకుస్థాపనకు వర్మ వచ్చే సమయంలో ఆసక్తి పరిణామం చోటుచేసుకుంది. భద్రతాపరమైన చర్యల దృష్ట్యా భారీగా అనుచరులతో వచ్చిన వర్మను పోలీసులు లోపలికి అనుమతించలేదు. వర్మ ఒక్కరే లోపలికి వెళ్లాలని సూచించారు. దీంతో తన మనుషులు లేకుండా వెళ్లేది లేదని వర్మ అక్కడే ఆగిపోయారు. ఇది గమనించిన పవన్ కల్యాణ్.. స్వయంగా వచ్చి వర్మను శంకుస్థాపనకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ చర్యతో ఇరువురు నేతల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా తొలగిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరి ఎవరు తగ్గారు?
పిఠాపురంలో పవన్ – వర్మ ఒకే ఫ్రేమ్ లోకి రావడంతో ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే వర్మ విషయంలో కాస్త పరిణితిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన గెలుపునకు ఎంతో కొంత సాయం చేసిన వర్మను అధికారం వచ్చాక పవన్ పక్కన పెట్టడం పిఠాపురం ప్రజలకు అంతా నచ్చలేదని సమాచారం. నియోజక వర్గ ప్రజల్లో వ్యతిరేకతను గమనించిన పవన్.. అభివృద్ధి కార్యక్రమాలకు రావాలని స్వయంగా ఫోన్ కాల్ చేసి పిలిచారని ప్రచారం జరుగుతోంది.