The Raja Saab Hero and Director
ఎంటర్‌టైన్మెంట్

The Raja Saab: ‘ది రాజా సాబ్’ ఆగిపోయినట్టేనా? మారుతికి ఇది పెద్ద దెబ్బే!

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా మారుతి (Director Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదని, అసలీ సినిమా ఉంటుందో, ఉండదో అనేలా టాక్ మొదలైంది. అందుకు కారణం ప్రభాస్ ఈ సినిమా విషయంలో హ్యాపీగా లేడనేది వినిపిస్తున్న వార్తలలోని సారాంశం. అందుకే ఈ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతుందని, అసలింత వరకు ఈ సినిమా ఓ కొలిక్కి కూడా రాలేదనేది తాజాగా వైరల్ అవుతున్న అంశం.

Also Read- Natural Star Nani: నాని బజ్జీలు తిను బాగుంటాయని మెగాస్టార్ చిరంజీవి అంటే..!

ప్రస్తుతం ప్రభాస్ ఇటలీ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు 4 నెలల పాటు ప్రభాస్ అక్కడే ఉంటారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా టీజర్‌ను రెడీ చేసి 3 నెలలు అవుతుందట. అందులోని సీజీ వర్క్ ప్రభాస్‌కి అస్సలు నచ్చలేదట. టీజర్‌‌లో సీజీ నచ్చక ప్రభాస్ వెళ్లిపోయాడని, అప్పటి నుంచి మారుతి టీజర్ కోసమే కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. ప్రభాస్ టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత టీజర్ చూసి ఓకే అంటే టీజర్ రిలీజ్ అవుతుంది. లేదంటే, పూర్తిగా ఈ ప్రాజెక్టే అటకెక్కే అవకాశం అయితే లేకపోలేదు. ఈ లోపు కాస్త హడావుడి చేయాలని మారుతి సోషల్ మీడియా వేదికగా ‘ది రాజా సాబ్’ అప్డేట్స్ అంటూ షో చేస్తున్నారనే వారు కూడా లేకపోలేదు.

ఎందుకంటే, ఈ సినిమా గురించి ఫ్యాన్స్ అప్డేట్ అని ఎన్ని సార్లు అడిగినా ఏదో ఒకటి చెప్పి మారుతి దాట వేస్తున్నారు. అసలు విషయం ఏమిటనేది మాత్రం చెప్పడం లేదు. అసలీ సినిమా షూటింగ్ నడుస్తుందా? ఆగిపోయిందా? అనే స్థాయికి ‘రాజా సాబ్’ని తీసుకెళ్లారు. అందుకే అసలు విషయం ఏమై ఉంటుందా? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఒకానొక దశలో సీరియస్‌గా కూడా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్న సందర్భాలున్నాయి. ఫ్యాన్స్ సీరియస్ అయిన ప్రతిసారి, ఇస్తాం.. టైమ్ పడుతుంది అంటూ మారుతి చెప్పుకొస్తున్నారు. కానీ, రెండు రోజుల తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా కామెంట్స్ నిజమే అని అనిపిస్తుందని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు.

Also Read- Chiranjeevi: చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ విశ్వ నగరమైంది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు చిత్ర టీజర్ రావాలన్నా, ప్రభాస్ ఇటలీ నుంచి రావాలి. ఆయన వచ్చి, అంతా చూసి ఓకే అంటేగానీ టీజర్ బయటకు రాదు. అప్పటి వరకు మారుతి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడీ స్టేజ్‌లో నిజంగా ‘రాజా సాబ్’ ఆగిపోతే మాత్రం అది మారుతి కెరీర్‌కి బాగా ఎఫెక్ట్ అవుతుంది. మరి టీజర్ కట్‌తో ప్రభాస్‌ని మారుతి ఎలా ఒప్పిస్తాడో? ఈ ప్రాజెక్ట్‌ని ఎలా ముందుకు తీసుకెళతాడో.. వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా సాఫీగా నడిచినా, ఇంకా టీజర్ కట్ వద్దే ఉన్నారు. మిగతా సినిమా ఎప్పటికీ పూర్తవుతుందో కూడా క్లారిటీ లేదు. సో.. ఎలా చూసినా, ఇప్పుడప్పుడే ‘రాజా సాబ్’ రావడం కష్టమే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?