Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ తుది దశ విచారణను ప్రారంభించింది. మే రెండో వారం వరకు విచారణకొనసాగనున్నది. ప్రస్తుతం కమిషన్ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టును స్టడీ చేస్తోంది. ఇప్పటివరకు ఇంజనీర్లను, నిర్మాణ సంస్థలను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లను కమిషన్ స్వీకరించింది. మే రెండో వారంలో ప్రభుత్వానికి కమిషన్ తుది రిపోర్ట్ ఇవ్వనున్నది. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ ను కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ సిద్ధం చేశారు.
దాదాపు 90 శాతం రిపోర్ట్ పూర్తి చేసింది. ఇంకా కమిషన్ కు ఎన్ డీఎస్ ఏ ఫైనల్ రిపోర్ట్ చేరలేదు. ఆ ఫైనల్ రిపోర్ట్ కోసం ఎన్ డీఎస్ఏ కి కమిషన్ లేఖ రాసింది. ఫైనల్ రిపోర్ట్ కోసం మరో మూడు వారాల సమయంను ఎన్ డీఎస్ ఏ అడిగినట్లు సమాచారం. కర్నాటక మాజీ సీఎం జయలలిత లాంటి కేసులను కమిషన్ పరిశీలిస్తున్నది.
Also Read: Bharat Summit 2025: రాహుల్ గాంధీ ఆలోచనలకు ప్రతిరూపంగా భారత్ సమ్మిట్.. టీపీసీసీ చీఫ్!
కమిషన్ రిపోర్టు అంతా పూర్తిచేసిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ను వచ్చే రెండో వారంలో కమిషన్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారం కేసీఆర్ స్టేట్మెంట్ను తీసుకోవాలనే కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వారి స్టేట్మెంట్లు రికార్డు చేసే యోచన లో కమిషన్ ఉంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై వేసిన కమిషన్ గడువును ఇప్పటికే నాలుగు సార్లు పొడిగించారు. ఈ నెల 30తో కమిషన్ గడువు ముగిసిపోనుండడంతో మరోసారి పొడిగించనున్నట్లు సమాచారం. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలన్న నిర్ణయంతో ఉన్నట్టు తెలిసింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు