Sarangapani Jathakam: రీసెంట్‌గా వచ్చిన ‘కోర్టు’ సినిమాతో ప్రియదర్శి (Priyadarshi) హిట్‌నే కాదు, మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు. అన్ని రకాల పాత్రలు చేస్తూ, ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నా ప్రియదర్శి.. ప్రస్తుతం ఓ సీనియర్ హీరో సినిమా కారణంగా బలి కావాల్సి వస్తుంది. అవును, ప్రియదర్శి నటించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమాను వాయిదా వేశారు. ఒకసారి సీనియర్ హీరో కోసం వాయిదా వేశారు. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు, నందమూరి నటసింహం బాలయ్య (Nata Simham Balakrishna). అవును బాలయ్య సినిమా కోసం ప్రియదర్శి బలి కావాల్సి వస్తుంది.
Also Read- Chiranjeevi: చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ విశ్వ నగరమైంది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
ఈ మధ్య బాలయ్య నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు కదా! అలాగే ప్రియదర్శి సినిమాకు పోటీగా బాలయ్య సినిమా ఏదీ కూడా విడుదల కావడం లేదు. మరి బాలయ్య సినిమా కోసం, ప్రియదర్శి ఎలా బలయ్యాడని అనుకుంటున్నారా? బాలయ్య సినిమా ఇటీవల విడుదలైంది. ఆయన ఎప్పుడో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిత్య 369’ (Aditya 369 Movie) చిత్రం ఇటీవల 4కె వెర్షన్‌లో రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రీ రిలీజ్‌లోనూ మంచి ఆదరణ పొందుతుందని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ భావించారు. కానీ వారు అనుకున్నది ఒకటైతే, అక్కడ జరిగింది మరొకటి.
ఈ సినిమా ఇప్పటి లేటెస్ట్ వెర్షన్‌కు మార్చడానికి అయిన ఖర్చు కూడా ఈ రీ రిలీజ్‌లో రాలేదని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసమని తీసుకున్న అడ్వాన్స్‌ల నిమిత్తం, ‘సారంగపాణి జాతకం’ సినిమాను బిజినెస్ కాకుండానే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. బాలయ్య సినిమాకు భారీగానే అడ్వాన్స్‌లు వచ్చాయని కానీ, ఆ సినిమా రీ రిలీజ్‌లో ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయింది. దీంతో చేసేది లేక ఆ అడ్వాన్స్‌లు ఇచ్చిన వారికే ప్రియదర్శి సినిమాను నిర్మాత ఇచ్చేశారట. అందుకే ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తుంది. ‘ఆదిత్య 369’ విషయంలో ఏం చేయాలో పాలుపోక, ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు.
Also Read- Dance Ikon2 Wild Fire: రూ. 75 వేలతో అత్యద్భుతంగా పాటలకు కొరియోగ్రఫీ.. శేఖర్ మాస్టర్ షాక్!
ఫైనల్‌గా మాత్రం నిర్మాత వెనక్కి తగ్గక తప్పలేదు. మరి ప్రియదర్శి సినిమాతో అయినా ఈ నిర్మాత గట్టెక్కుతాడేమో చూడాల్సి ఉంది. ఈ మధ్య ప్రియదర్శి నటించిన ‘బలగం’ (Balagam), ‘35 చిన్న కథ కాదు’, ‘కోర్టు’ (Court) చిత్రాలు భారీగానే కలెక్షన్స్ రాబట్టాయి. మరి ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరితే మాత్రం, నిర్మాత సేఫ్ అయినట్టే. లేదంటే మాత్రం మరోసారి నిర్మాతకు తీవ్ర నిరాశ తప్పదు. అలాగే ‘ఆదిత్య 369’ వంటి సంచలన చిత్రాన్ని అందించిన శ్రీదేవి మూవీస్ బ్యానర్ ప్రతిష్ట పడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏం జరుగుతుందో ఇంకొన్ని గంటల్లో తెలిసిపోనుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు