Chiranjeevi and Chandrababu Naidu
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi: చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ విశ్వ నగరమైంది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో సున్నితమైన విషయంలో వేలు పెట్టారు. ఈ మధ్య చిరంజీవి కొన్ని ఫంక్షన్స్‌లో టంగ్ స్లిప్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ మాట్లాడి, వార్తలలో నిలుస్తున్నారు. విజయవాడలో మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ అనే పుస్తక ఆవిష్కరణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఒకే వేదికపై పొలిటికల్ మెగాస్టార్, టాలీవుడ్ మెగాస్టార్ కనిపించనుండటంతో ఈ వేడుక ఎంతో ప్రాముఖ్యంగా మారింది. అలాగే ఈ వేడుకలో ఎవరెవరు ఏమేం మాట్లాడుతారో అని మీడియా కూడా కాస్త ఉత్సాహాన్ని కనబరిచింది. అంతా భావించినట్లుగానే చిరంజీవి మరోసారి తన స్పీచ్‌తో హైలెట్ అయ్యారు.

Also Read- Dance Ikon2 Wild Fire: రూ. 75 వేలతో అత్యద్భుతంగా పాటలకు కొరియోగ్రఫీ.. శేఖర్ మాస్టర్ షాక్!

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చంద్రబాబును ఒక మహానాయకుడిగా అభివర్ణించారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబు నాయుడు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. రాజకీయాల్లో రాణించాలని, ప్రజలకు సేవ చేయాలని కాలేజీ రోజుల్లోనే ఆయనకు బీజం పడిందని అన్నారు. చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్లి, విశ్వ నగరంగా మారిందని చెప్పుకొచ్చారు. ఆయన హైదరాబాద్ పయనీర్ అని, అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు ఎంతో విజన్‌తో పనిచేశారని.. చంద్రబాబుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

చంద్రబాబు కూడా మెగాస్టార్‌ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. సినీ నటులుగా సామాజిక సేవ గురించి ఆలోచించిన మొదటి వ్యక్తి చిరంజీవి అని చంద్రబాబు కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనుకుంటున్నాం.. స్థలం కావాలని చిరంజీవి అడిగారని, అలా సామాజిక సేవ గురించి ఆలోచించి, అభిమానులను కూడా అటువైపు నడిపించిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే హైదరాబాద్ డెవలప్‌మెంట్ అనేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సున్నితమైన అంశంగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు పేరు వినబడితే, తెలంగాణ వ్యక్తులు కొందరు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు చిరు డైరెక్ట్‌గా చంద్రబాబే అని చెప్పడంతో.. ఇదొక కాంట్రవర్సీ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు.

Also Read- Gopi Sundar: ‘కొరగజ్జ’తో ప్రయోగం చేశా.. ఇంతకీ ‘కొరగజ్జ’ అంటే ఏంటో తెలుసా?

ఇక ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ పుస్తకాన్ని రచించిన శరణి ఎవరో కాదు, ఏపీ పురపాలక శాక మంత్రి నారాయణ కుమార్తె, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు. అందుకే చంద్రబాబు, చిరంజీవి ఈ వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి, గంటా ఫ్యామిలీల మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు.

మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తున్నారు. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ చేస్తున్న చిరంజీవి.. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలకు సైన్ చేశారు. అందులో ఒకటి, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడితో కాగా, రెండోది ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు