NVSS Prabhakar: స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని ఆయన పేర్కొన్నారు. పహల్ గావ్ లో జరిగిన ఉగ్రదాడికి మూల్యం చెల్లించక తప్పదని ఆయన పేర్కొన్నారు.
Also Read: Jogulamba Temple: అవినీతిపై కఠినంగా దేవాదాయ శాఖ.. జోగులాంబ ఆలయ ఆర్చకుడిపై చర్యలు!
ఈ దాడి నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్తులు హైదరాబాద్ లో ఉన్నారని, వీరందరిని వెంటనే వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు.
బీఆర్ఎస్ ఏం సాధించిందని ఉత్సవాలు చేసుకుంటోందని ప్రభాకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ రూలింగ్ తో పాటు.. అపోజిషన్ లో కూడా ఫెయిలైన పార్టీగా ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కు సేనాధిపతి తిరుగుబాటు తప్పదని ప్రభాకర్ పేర్కొన్నారు. మిషన్ కోసం ఏర్పాటు చేసిన పార్టీ కమీషన్లు తీసుకుందని ఆయన ఆరోపించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు