AP Digital Governance: పహల్గాంలో ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన చంద్రమౌళి కుటుంబ సభ్యులను పీసీసీ చీఫ్ షర్మిల పరామర్శించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి, ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండియా నిఘా వ్యవస్థలను మోడీ వ్యవస్థలుగా మార్చారని ఆరోపించారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా మోడీ కోసం పని చేస్తుందన్నారు. మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పని చేస్తుందని విమర్శలు గుప్పించారు.
ఈ ఘటన కు బాధ్యులు మోడీ, అమిత్ షా అన్నారు. వీళ్లిద్దరూ తక్షణం రాజీనామా చేయాలన్నారు. పహల్గాంలో ఉగ్రదాడి ఘటనలో 30 మంది చనిపోవడం చాలా బాధాకరం అని షర్మిల అన్నారు. విశాఖకు చెందిన చంద్ర మౌళి భార్యను ఆమే పరామర్శించారు. నిస్సహాయ టూరిస్టులపై జరిగిన దాడి మాత్నమే కాదని ఇది మన దేశం పై జరిగిన దాడి అని షర్మిల అన్నారు. ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ లో మోడీ శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని క్యాంపెయిన్ కూడా నడిపారు.
Also Read: AP CM Chandrababu: ప్రణాళిక ప్రకారమే దాడి.. పహల్గాం ఉగ్రదాడిపై సీఎం సీరియస్!
అంత మంది టూరిస్టులు లపై కాల్పులు జరిగినా 15 నిం తరవాత ఆర్మీ వచ్చిందని ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం మోడీకి అమిత్ షా కి లేదా అని షర్మిలా అన్నారు. ఇంత మంది చనిపోవడానికి మోడీ అమిత్ శా కారణం కాదా మోది అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని ఆమే డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు.
ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం తప్పిద మేనని కేంద్ర ఇంటిలిజెన్స్ ఘోరంగా విఫలమైందని ఇంటిలిజెన్స్ ని అపోజిషన్ ని అణచడానికి వాడుతున్నారు అని షర్మలా అన్నారు. మోడీ ఇంటర్నల్ టెర్రరిస్ట్మతం పేరు చెప్పి దేశంలోనే అంతర్గతంగా యుద్ధం చేస్తున్నారు అని అన్నారు.
Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/