Pahalgam Terror Attack (Image Source: Twitter)
Uncategorized

Pahalgam Terror Attack: సీఎం సంతాపం.. క్యాండిల్ ర్యాలీ సైతం వాయిదా.. ఏమైందంటే?

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటనను దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరు సంతాపం తెలియజేస్తున్నారు. దాడిలో అసువులు బాసిన వారికి ప్రతీఒక్కరూ కన్నీటితో సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu)సైతం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కోవలోనే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం ఉగ్రదాడిపై స్పందించారు. దాడి ఘటననను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేవంత్ అన్నారు.

సీఎం సంతాపం
జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్.. అత్యవసర భేటి నిర్వహించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం (Command And Control Centre)లో సమావేశమయ్యారు. ఈ భేటిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), పలువురు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో చనిపోయివారికి సీఎం రేవంత్ తో పాటు అందరూ సంతాపం తెలిపారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అటు కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులను భద్రంగా రాష్ట్రానికి తీసుకొచ్చే అంశంపై సీఎం చర్చించారు.

Also Read: 11 Died In Telangana: నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. 24 గంటల్లో 11 మంది మృతి!

క్యాండిల్ ర్యాలీ వాయిదా
ఉగ్రదాడిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ క్యాండిల్ ర్యాలీ (Candle Rally)కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ తీయాలని భావించారు. ఈ క్రమంలో తాజాగా భేటిలో ఈ అంశంపై చర్చ సైతం నిర్వహించారు. అయితే అనూహ్యంగా ఈ ర్యాలీ రేపటికి వాయిదా పడింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రేపు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ ర్యాలీ కూడా రేపటికి వాయిదా పడింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!