BJP big plan on Sri Rama Navami day
Politics

BJP : రాజకీయ నవమి!

– మొన్న ఉగాది.. నేడు శ్రీరామ నవమి
– పండుగ ఏదైనా ఓట్లే పరమావధి
– శ్రీరామ నవమికి భారీ ప్లాన్స్
– శోభాయాత్రల్లో బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు
– ఇంటింటికీ మేనిఫెస్టో కరపత్రాల పంపిణీ
– హిందూవుల ఓట్లే టార్గెట్‌గా పావులు కదుపుతున్న బీజేపీ

BJP big plan on Sri Rama Navami day(Political news telugu): తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాల్లో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను తట్టుకుని ఆ లక్ష్యం నెరవేరడం కష్టమే అయినా, హిందూవుల ఓట్ల షేర్‌ను పెంచుకునే ప్లాన్స్‌లో ఉంది. 12 పార్లమెంటు స్థానాల్లో గెలుపే లక్ష్యం అంటోంది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అందులో భాగంగానే శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండాను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని, శోభాయాత్రలు చేయాలని ప్లాన్ చేసింది. రామనవమి సందర్భంగా ప్రతి బూత్ లెవెల్‌లో ఏదో ఒక రకమైన కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికను కమలం పార్టీ రూపొందించింది. శోభాయాత్రలతో పాటు ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంది. ప్రతి బూత్ లెవెల్‌లో రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్లీలూ, జెండాలు కట్టాలని నిర్ణయించారు నేతలు.

కరపత్రాలతో మేనిఫెస్టో

ఇప్పటికే ఇంటింటికీ బీజేపీ అనే నినాదంతో కమలనాథులు మేనిఫెస్టో అంశాలను కరపత్రం రూపంలో అందిస్తున్నారు. శ్రీరామనవమి వేడుకలతో మరోసారి ఓటర్లను కలుసుకుని సెంటిమెంట్‌తో లబ్ధి పొందాలని చూస్తున్నారు.ప్రజల్లో చైతన్యం నింపడంతో పాటు తమ పార్టీ వైపు ఆకర్షితులను చేయాలని అనుకుంటున్నారు. ఈ వేడుకల్లో బీజేపీ అనుబంధ సంఘాలతో పాటు సంఘ పరివార క్షేత్రాలకు చెందిన వారు భాగస్వాములు కానున్నారు. ఇప్పటికే హాజరయ్యే నేతలు, కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఈ వేడుకల్లో కార్యకర్తలు, నాయకులు కాషాయ కండువాలు మాత్రమే ఉపయోగించాలని, పార్టీ కండువాలు వాడొద్దని సూచనలు చేసినట్లు సమాచారం.

హిందూవుల ఓట్ల కోసమే!

హిందువుల ఓట్లన్నీ బీజేపీకి గంపగుత్తగా పడేలా చేయాలనేదే బీజేపీ ప్లాన్. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠను మరోసారి ప్రజలకు వివరించేందుకు ఈ వేడుకలు కలిసొస్తాయని భావిస్తోంది. ఇప్పటికే అయోధ్య అక్షింతల పేరుతో ప్రజలను కలిసిన బీజేపీ, మరోసారి శ్రీరామనవమి సందర్భంగా కలిసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా ప్రజలను కలిసి ఈ పదేండ్లలో మోడీ సర్కారు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. అంతేకాకుండా కరపత్రాలు, స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికించేలా ప్లాన్ చేసుకున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!