Harley Davidson Tariffs (Image Source: Twitter)
లైఫ్‌స్టైల్

Harley Davidson Tariffs: భారతీయులకు ట్రంప్ గిఫ్ట్.. తక్కువ ధరకే ఖరీదైన బైక్స్.. భలే ఛాన్స్ లే!

Harley Davidson Tariffs: యూత్ బాగా ఇష్టపడే వాటిలో మోటర్ బైక్స్ ముందు వరుసలో ఉంటాయి. ఖరీదైన బైక్ పై రయ్.. రయ్.. అంటూ దూసుకెళ్లేందుకు యువత ఆసక్తి కనబరుస్తుంటారు. హై రేంజ్ బైకులపై తిరగడాన్ని ఫ్యాషన్ గా ఫీలవుతుంటారు. అయితే హై ఎండ్ మోటార్‌ సైకిళ్లు దాదాపుగా విదేశాల నుంచి దిగుమతి కానుండటంతో అవి కాస్త ఖరీదైనవిగా ఉంటాయి. దీంతో చాలా మంది యువత ఆ బైక్స్ ను కొనాలని ఉన్నా.. సరిపడ డబ్బులేక వెనకడుగు వేస్తుంటారు. అయితే అటువంటి యూత్ కు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే ఖరీదైన బైక్స్ అందుబాటులోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది.

చౌకగా హార్లీ డేవిడ్ సన్ బైక్స్!
విదేశాల నుంచి దిగుమతయ్యే హార్లీ డేవిడ్ సన్ బైక్ (Harley davidson) లకు భారత్ లో మంచి క్రేజ్ ఉంది. యూత్ ఈ బైక్ పై విహరించడాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తుంటారు. నలుగురిలో ఇది తమను ప్రత్యేకంగా ఉంచుతుందని అభిప్రాయపడుతుంటారు. ఈ నేపథ్యంలో కొందరు యూత్ ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా హార్లే డేవిడ్ సన్ తో పాటు అమెరికన్ కంపెనీ బైక్ లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ బైక్స్ కొనాలని ఉన్నా కొనలేని వారికి భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దిగుమతి సుంకాలని అమాంతం తగ్గించింది. దీంతో గతంతో పోలిస్తే హార్లే డేవిడ్ సన్ బైక్ మోడల్స్ తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

పన్నులు ఎంత తగ్గాయంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతయ్యే బైక్ పై భారత్ వెనక్కి తగ్గింది. హై-ఎండ్ మోటార్‌ సైకిళ్లపై కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 1,600 cc వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లపై విధిస్తున్న సుంకాన్ని 50% నుండి 40%కి తగ్గించింది. 1,600 cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లపై 50% నుండి 30%కి పన్ను పరిమితం చేసింది. అలాగే సెమీ-నాక్డ్ డౌన్ (SKD) కిట్లపై సుంకాన్ని 25% నుండి 20%కి.. పూర్తిగా నాక్డ్ డౌన్ (CKD) కిట్లపై పన్నును 15% నుండి 10%కి భారత ప్రభుత్వం తగ్గించింది.

Also Read: Lady Aghori: అరెరె పెద్ద సమస్య వచ్చిందే.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దు అఘోరీ!

పెరగనున్న ఖరీదైన బైక్ సేల్స్
తాజా పన్ను సవరణలతో అమెరికా నుంచి వచ్చే బైక్ ధరలు గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉంది. దీని వల్ల గతంలో ఆ బైక్ ను కొనేందుకు ఆలోచించిన యువత.. ఈసారి ధైర్యంగా కొనుగోలు చేసేందుకు వీలు పడుతుంది. అటు హార్లీ డేవిడ్ సన్ వంటి సంస్థలు సైతం భారత్ లో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. భారత మార్కెట్ లో తమ బైక్ సేల్స్ గణనీయంగా పెరుగుతాయని అభిప్రాయ పడుతున్నాయి.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్