Ponnam Prabhakar on Attack: జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి బాధాకరం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో నిన్న జరిగిన ఘటన బాధాకరమైంది, దుఃఖ భరితమైంది ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. దేశంలో వివిధ అంశాల మీద బేధాభిప్రాయాలు ఉంటాయి కావచ్చు కానీ దేశ అంతర్గత భద్రతకు సంబంధించి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు అందరూ ముక్తకంఠంతో అందరం ఏకాభిప్రాయంతో ఉంటాలని మంత్రి పొన్నం అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ సంఘటన తలవంచుకునే కార్యక్రమం మూడు రోజుల క్రితం ఈ ప్రాంతానికి పోయి వచ్చిన టూరిస్ట్ లు ఎవరైనా రావచ్చు అని అక్కడి స్థానికులు చేస్తున్నారు టూరిస్ట్ లు వస్తేనే మాకు ఉపాధి అని తెలిపారని గుర్తుచేశారు.
Also Read: Dubbaka Lands: పేదోళ్ల భూముల్లో దొరల పాగా! భూ భారతి వచ్చినా మారని తీరు!
టూరిస్టులకు స్థానికులు సహకరిస్తున్నారు ఈ దుశ్చర్యం వల్ల ఆ వర్గానికి సంబంధించిన వారి ఉపాధి అవకాశాలు దెబ్బతీసినట్టే 15 లక్షల మంది 15 రోజుల్లో అక్కడ విజిటింగ్ చేశారు అని మంత్రి పొన్నం తెలిపారు. శాంతి భద్రతల సమస్యలపై అక్కడికి టూరిస్ట్ లు రారు ఇది జమ్మూ కాశ్మీర్ స్థానికులకే ఇబ్బంది అని వాళ్ళ కడుపు వాల్లే కొట్టినట్టైతుందని మంత్రి పొణం అన్నారు. కేంద్రం ఎటువంటి సంకోచం లేకుండా కఠినంగా వ్యవహరించాలనీ కోరుతున్నాని, మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామరని మంత్రి పొణం ప్రభాకర్ అన్నారు.
Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/