Janasena on Terror Attack: జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ దుశ్చర్యను ఖండించి, మృతులకు సంతాపం తెలియచేశారు.
జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.
Also read:Weather Update: దేశంలో వడగాలులు.. IMD హెచ్చరికలు!
బుధవారం ఉదయం అన్ని పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకూ దించి ఉంచాలని స్పష్టం చేశారు. సాయంత్రం కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని, శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా మానవ హారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని తెలియచేశారు.