Case on MLA Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి (Kaushik Reddy) పై కేసు నమోదు అయ్యింది. తన భర్తను బెదిరించి రూ. 25 లక్షల రూపాయలు తీసుకున్నారని పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మరో రూ. 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఫోన్ చేసి బెదిరించారని బాధితురాలు ఉమాదేవి (Uma Devi) పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. డబ్బులు ఇవ్వకపోతే తన భర్తను, కుటుంబ సభ్యులను కౌషిక్ రెడ్డి బెదిరించినట్లు ఆమె ఆరోపించింది.
Also Read: UPSC CSE 2024 toppers: సివిల్స్ ఫలితాల్లో తెలుగువారి మార్క్.. మన టాపర్లు వీరే!
బీఆర్ఎస్ (BRS) ముఖ్యనేతల్లో ఒకరైన పాడి కౌషిక్ రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని బాధితురాలు ఉమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్ (Subedari Police Station) లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కౌషిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 308(2), 308(4), 352 బీ ఎన్ ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.