OTT Movies: ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో , నెట్ ఫ్లిక్స్ , సన్ నెక్స్ట్ , హాట్స్టార్ విడుదల అవుతుంటాయి. అయితే, ఈ వారం మన ముందుకు ఏయే చిత్రాలు రాబోతున్నాయో ఇక్కడ చూద్దాం..
మ్యాడ్ స్క్వేర్
మ్యాడ్ స్క్వేర్ మూవీ మార్చి 28 న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కర్ నటించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాతలుగా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. షామ్‌దత్ గా సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అయితే, ఈ మూవీ ఏప్రిల్ 25 న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. థియేటర్ లో చూడలేని వారు ఓటీటీలో చూసేయండి.
Also Read: Medak Tragedy: మెదక్‌లో కలచివేసిన సంఘటన.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి, ఇద్దరు చిన్నారులు
L2: ఎంపురాన్ (తెలుగు)
L2: ఎంపురాన్ ( ) మూవీ మార్చి 27 న రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హీరో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, మంజు వారియర్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితర నటీ నటులు నటించారు. ఈ మూవీకి దర్శకత్వంపృథ్వీరాజ్ సుకుమారన్ వహించారు. దీపక్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే, L2: ఎంపురాన్ మూవీ ఏప్రిల్ 24 న జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read: Waragal Gurukulam: గురుకుల ప్రవేశాల్లో నియమాల మాయం.. విద్యార్థులపై అన్యాయం ఎవరి బాధ్యత?
వీర ధీర సూర
వీర ధీర సూర చిత్రం మార్చి 27 న న రిలీజ్ అయింది. విక్రమ్, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, దుషార విజయన్, పృథ్వీరాజ్, సిద్ధిఖీ తదితర నటీ నటులు చూపించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించారు. థేని ఈశ్వర్ గా సినిమాటోగ్రఫీగా పని చేశారు. జీకే నిర్మాతగా పని చేశారు. అయితే, ఏప్రిల్ 24 న వీర ధీర సూర 2025 ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు