PSR Anjaneyulu Arrest: ముంబయి నటి కాదంబరి జత్వానీ (Kadambari Jethwani) వేధింపుల కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను (PSR Anjaneyulu) పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. . హైదరాబాద్ బేగంపేటలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు పీఎస్ఆర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సాయంత్రం లోగా అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: Singer Pravasthi : ప్రవస్తి బ్యాక్ గ్రౌండ్ ఉన్నదెవరు? టార్గెట్ సునీత అందుకేనా?
మరోవైపు ఇదే కేసులో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమ కేసులతో నటిని వేధించినట్లు ఐపీఎస్ ఆఫీసర్లు క్రాంతి రానా టాటాతో పాటు విశాల్ గున్నిలపై ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరిద్దరు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం వారి అరెస్ట్ సాధ్యపడలేదు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన పీవీఆర్ ఆంజనేయులు మాత్రం కోర్టులో ఎలాంటి ముందస్తు బెయిల్ అప్లై చేసుకోలేదు. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబయి నటి కాదంబరి జత్వానీని విజయవాడకు తీసుకువచ్చి వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నటి ఫిర్యాదు మేరకు వైసీపీ నేతతో పాటు పోలీసు అధికారులపై అభియోగాలు మోపారు.