Sumathi Shatakam: అమర్‌దీప్ చౌదరి (Amardeep Chowdary) తెలుసా.. బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అమర్‌దీప్ పేరు ఈ మధ్యకాలంలో బాగానే వినిపిస్తూ వస్తుంది. ‘బిగ్ బాస్’ (Bigg Boss) షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మిగతావారికి ఏమో గానీ, అమర్‌దీప్‌కు మాత్రం బాగా వర్కవుట్ అయిందనే చెప్పుకోవాలి. మాస్ మహారాజా రవితేజకు డై హార్డ్ ఫ్యాన్ అయిన అమర్‌దీప్, ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అమర్‌దీప్ క్రేజ్ అమాంతం పెరిగింది. దాదాపు 3 సినిమాలలో ఆయనకు హీరోగా అవకాశాలు వచ్చాయి. అందులో ఒక చిత్రం తాజాగా అమరావతిలో ఘనంగా ప్రారంభమైంది.
Also Read- Rambha: నా రక్తంలోనే ఉంది.. 30 ఏళ్ల క్రితం మ్యాజిక్ మరోసారి రిపీట్!
సన్నీ లియోన్ (Sunny Leone) ప్రధాన పాత్రలో నటించిన ‘మందిర’ చిత్రాన్ని నిర్మించిన విజన్ మూవీ మేకర్స్ అమర్‌దీప్ హీరోగా ‘సుమతీ శతకం’ అనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతుండగా, అమర్‌దీప్ చౌదరి సరసన సైలీ చౌదరి హీరోయిన్‌గా నటించనుంది. ఈ యూత్‌ఫుల్, ఎంగేజింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని అమరావతిలోని వైకుంఠపురం విలేజ్ టెంపుల్‌లో ఘనంగా ప్రారంభించారు. (Sumathi Shatakam Movie Launched)
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రత్యేక అతిథులతో పాటు చిత్ర తారాగణం, సిబ్బంది పాల్గొన్నారు. ముహూర్తపు షాట్‌కు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్ కొట్టగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ చిత్రానికి బండారు నాయుడు కథను అందించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘అమర్‌దీప్‌తో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. యూత్ మెచ్చే, నచ్చే మంచి స్క్రిప్ట్‌తో ఈ సినిమాను చేస్తున్నాం. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు ఎం.ఎం. నాయుడు (MM Naidu) అద్భుతంగా తెరకెక్కించబోతున్నారు. ఖర్చు విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించబోతున్నాం. ఏపీ, తెలంగాణలోని పలు అందమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని షూట్ చేయనున్నాం. తప్పకుండా మా బ్యానర్‌లో మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అని చెప్పగలను’’ అని అన్నారు.
Also Read- Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!
అమర్‌దీప్ మాట్లాడుతూ.. ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు హీరోగా వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో నా డ్రీమ్ ఇది. సీరియల్ నటుడిగా ఆదరించారు. బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లినప్పుడు ఆదరించారు. ఇప్పుడు హీరోగా మీ ముందుకు వస్తున్న నన్ను, మా టీమ్‌ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మంచి టీమ్‌తో, మంచి కథతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నానని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు