Singer Pravasthi: బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన పాడుతా తీయగా కార్యక్రమంపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య (Singer Pravasthi Aaradhya) చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ‘పాడుతా తీయగా’ (Padutha Theeyaga)లో తనకు జరిగిన చేదు అనుభవాల గురించి ప్రవస్తి బయటపెట్టింది. ఈ సందర్భంగా పాటల రచయిత చంద్రబోస్ (Chandrabose), సంగీత దర్శకుడు కీరవాణి (MM Keeravani), గాయనీ సునీత (Singer Sunitha)లపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే వ్యవహారంలోకి వైసీపీ సోషల్ మీడియా తలదూర్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కార్యకర్తలు ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు.
కీరవాణిపై విమర్శలు
సింగర్ ప్రవస్తి ఆరాధ్య పక్షాన నిలబడుతూ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కీరవాణిని కావాలనే వైసీపీ టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కీరవాణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఆయనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పైగా కీరవాణికి టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పాడుతా తీయగా జడ్జిలపై ( సింగర్ సునీత, కబంధహస్తాల కీరవాణి, చంద్రబోస్ ) తీవ్ర ఆరోపణలు చేసిన సింగర్ ప్రవస్తి.
టాలెంట్ ని తొక్కడానికి ప్రయత్నించారు
ఎక్సపోసింగ్ చెయ్యమన్నారు.
సింగెర్స్ తో చాకిరి చేయించుకుంటా. వెడ్డింగ్స్ లో పాటలు పాడేవాళ్ళంటే నాకు అసహ్యం, ఇవి కీరవాణి చిలకపలుకుల pic.twitter.com/fRPvOWwbpn
— Warrior YSRCP (@Vamsee007) April 21, 2025
వైసీపీ లక్ష్యం అదేనా
అటు పాడుతా తీయగా కార్యక్రమంపైనా వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొత్త సింగర్లకు ఎన్నో ఆశలు కల్పించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి పాడుతా తీయగా కార్యక్రమం.. రామోజీ గ్రూప్స్ కు చెందిన ఈటీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఆ సంస్థకే చెందిన ఈనాడు పత్రిక.. తమకు యాంటీ అని వైసీపీ శ్రేణులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సింగర్ ప్రవస్తి వ్యవహారంతో ఈటీవీలోని ప్రముఖ షో పేరు బయటకు రావడంతో వైసీపీ పార్టీకి ఒక అస్త్రం దొరికినట్లయ్యిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సింగర్ వ్యవహారం తీసుకొని రామోజీ గ్రూప్ సంస్థలను ఇరుకున పెట్టాలని ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ భావిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Pravasthi Aaradhya: సింగర్ సునీత పై సంచలన ఆరోపణలు చేసిన ప్రవస్తి ఆరాధ్య
సింగర్ ఏమన్నదంటే?
‘పాడుతా తీయగా’ కార్యక్రమంపై స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సింగర్ ప్రవస్తి (Singer Pravasthi).. న్యాయనిర్ణేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సింగర్ సునీత ఎంతో అందమైనవారని పొగుతూనే ఆమె మనసు మాత్రం మంచిది కాదని తేల్చి చెప్పింది. తను తప్పుపాడితే వేలెత్తి చూపే పాటల రచయిత చంద్రబోస్.. మరికొందరు సింగర్స్ విషయంలో మాత్రం ఆ పని చేయలేదని పేర్కొంది. అటు ఆస్కార్ విజేత కీరవాణికి సింగర్స్ అంటే గౌరవం లేదని వీడియోలో ఆరోపించింది. బాడీ షేమింగ్ చేసేవారని.. బొడ్డు కిందకు చీర కట్టమని చెప్పేవారని వాపోయింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.