Money Earning Tips: ప్రస్తుత రోజుల్లో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పెరిగి పోయిన జీవన ప్రమాణాల కారణంగా ఎంత సంపాదించినా చాలడం లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలి చాలని జీతంతో కుటుంబాలను నెట్టుకొస్తూ ఉన్న ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం చేసుకుంటూనే ఆన్ లైన్ ద్వారా అదనంగా డబ్బు సంపాదించగలిగితే చాలా బాగుంటుంది కదా. ఆన్ లైన్ లో సంపాందించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. దాని ద్వారా నెలకు రూ.20,000 పైగా సంపాదించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్రీలాన్స్ పనులు
ప్రస్తుత రోజుల్లో ఫ్రీలాన్సింగ్ వర్క్ కు చాలా ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో చాలా రకాల ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. రోజుకు 2-4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్, డేటా ఎంట్రీ, టెలీ కాలింగ్ వంటి వాటి ద్వారా నెలకు రూ.20,000 వరకూ సంపాదించవచ్చు.
యూట్యూబ్
సోషల్ మీడియాలో మెరుగైన సంపాదన కోరుకునేవారికి యూట్యూబ్ ప్రధాన ఆదాయ మార్గంగా ఉంది. మీ ఆసక్తిని బట్టి ఏదైనా రంగానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ క్రియేట్ చేయండి. ఒకవేళ మీ ఫేస్ బహిర్గతం చేయడం ఇష్టం లేకుంటే ఏఐ టూల్స్ ఉపయోగించి ఫేస్ లెస్ వీడియోతో కొత్త తరహా కంటెంట్ ను క్రియేట్ చేయండి. దీని ద్వారా నెలలో అదనంగా మంచి ఆదాయం సంపాదించవచ్చు
మార్కెటింగ్
ఈ రోజుల్లో ప్రతీ వస్తువుకు మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైంది. కాబట్టి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో వంటి సంస్థలు తమ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేసేవారికి మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, వాట్సప్ ద్వారా సదరు కంపెనీల ప్రొడక్ట్స్ లింక్స్ షేర్ చేసి డబ్బు సంపాదించవచ్చు.
ఆన్ లైన్ ట్యూషన్
మీకు ఏదైనా సబ్జెక్ట్ లో మంచి ప్రావీణ్యం ఉంటే.. ఇంటి వద్ద నుంచి ఆన్ లైన్ ట్యూషన్స్ చెప్పవచ్చు. సంస్కృతం, గణితం, కంప్యూటర్ కోర్సులు వంటి అంశాలు బోధించగలిగితే మంచి ఆదాయాన్ని అందుకోవచ్చు. జూమ్, గూగుల్ మీట్ వంటి వాటిని మాద్యమంగా ఉపయోగించుకోని.. ఆన్ లైన్ ట్యూషన్ నిర్వహించవచ్చు. మీ సామర్థ్యాన్ని బట్టి.. నెలకు రూ.20,000కు పైగా సంపాదన పొందవచ్చు.
Also Read: BRS Silver jubilee celebrations: రజతోత్సవ సభ కోసం వాగులు పూడ్చేశారా? ఇదేందయ్యా ఇదెక్కడా చూడలా!
యోగా క్లాస్ లు
కొందరు చిన్నప్పటి నుంచి యోగా చేస్తూ దానిపై గణనీయంగా పట్టు సాధించి ఉంటారు. అటువంటి వారు ఆన్ లైన్ వేదికగా యోగాపై స్పెషల్ క్లాస్ లు తీసుకోవచ్చు. యోగా ట్రిక్స్ నేర్పిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న వారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. ఇందుకు మీరు అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఏది ఉండదు. జూమ్, గూగుల్ మీట్ ఉపయోగించి ఎంచక్కా యోగా క్లాసులు నిర్వహించుకోవచ్చు.