Court Movie Actress: ఇటీవలే టాలీవుడ్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన సినిమాలు పెద్ద హిట్ కొడుతున్నాయి. ఈ మధ్య కథ నచ్చితే తప్ప ఆడియెన్స్ సినిమా థియేటర్ కి వెళ్లి చూడటం లేదు. కాబట్టి, ఎంత పెద్ద డైరెక్టర్ అయిన మంచి కంటెంట్ తో వస్తేనే ఇక్కడ నిలబడగలుగుతారు. టైమ్ పాస్ కోసం ప్రేక్షుకులు సినిమాలు చూసే రోజులు పోయాయి. కాబట్టి, కొంచం ఆలస్యమైన మంచి కథను సిద్ధం చేసుకునే వస్తే మంచి ఫలితం ఉంటుందని సినీ లవర్స్ సలహా ఇస్తున్నారు.
Also Read: BRS Silver jubilee celebrations: రజతోత్సవ సభ కోసం వాగులు పూడ్చేశారా? ఇదేందయ్యా ఇదెక్కడా చూడలా!
అయితే, రీసెంట్ గా మార్చి 14 న ‘కోర్ట్’ మూవీ రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి లాయర్‌గా నటించిన ఈ మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవిలు హీరో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. సీనియర్ యాక్టర్ శివాజీ ప్రతినాయకుడిలో నటించి చించేశారు. మంగపతి పాత్రకి ప్రాణం పోశారు. ఆయన వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చి థియేటర్స్‌లో ఒక్క అరుపుతో అందర్ని భయపెట్టేశారు. వాస్తవానికి ఈ సినిమా హిట్ అవ్వడానికి సగం కారణం శివాజీనే. ఆయన సీన్స్ వచ్చిన ప్రతిసారి ఆడియెన్స్ విజిల్స్ వేశారు. చిన్న మూవీగా మన ముందుకొచ్చినా న ఈ చిత్రం కలెక్షన్లను కొల్లగొట్టి.. పెద్ద మూవీస్ తో పోటీ పడింది. ఈ మూవీ చూసి చెప్పిన ప్రతి ఒక్కరూ.. ఏమైనా తీశారా?? ‘కోర్ట్’ మూవీ అదిరిపోయింది. ఇలాంటివి తీస్తే మేము ఎందుకు ఎంకరేజ్ చేయకుండా ఉంటామంటూ ఫ్యాన్స్ అన్నారు. ఇదిలా ఉండగా, కోర్టు మూవీ పెద్ద హిట్ అవ్వడంతో సినిమాలో నటించిన యంగ్ హీరోయిన్ శ్రీదేవి కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Also Read: Gold Rates: ఓరి నాయనో.. బంగారం రేటు సరికొత్త రికార్డ్.. ఇక కొనలేం..
ఈ నేపథ్యంలో శ్రీదేవి మాట్లాడుతూ ” ఓం నమో వేంకటేశాయ.. నేను ఇక్కడ వాడపల్లిలో ఉన్నాను. నా పేరు శ్రీదేవి అని మొదలు పెట్టి.. కోర్టు మూవీ మీ అందరికీ తెలుసా కదా.. ఆ సినిమాలో జాబిల్లి పాత్ర చేశాను. ఈ గుడిలో శ్రీ వేంకటేశ్వర స్వామిని 7 వారాలు మొక్కుకున్నాను. నాకు రెండవ వారమే కోర్టు సినిమా అవకాశం వచ్చిందని చెప్పింది. ఒక మంచి చిత్రంలో ఛాన్స్ రావాలని ఇక్కడ ఏడు వారాలు చేశాను. అయితే, అసలు ఊహించలేదు రెండో వారంలోనే కోర్టు సినిమా వచ్చింది. ఆ మూవీ తెలుగు సినీ ఇండస్ట్రీ లో పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఏడు వారాలు పూర్తవ్వడంతో పూజ చేపించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను కోరుకున్న కోరిక నెరవేరింది. చాలా మంచి జరిగింది. కోర్టు వల్ల ఫేమ్ వచ్చిందని చెప్పింది. మీరు కూడా ఇక్కడ రావాలని కోరుకుంటున్నానని ” తన అనుభవాన్ని ఆమె స్వయంగా చెప్పడంతో భక్తులలో విశ్వాసం పెరిగింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు